Yamudu Telugu Movie First Glimpse: నిజానికి తెలుగు సినిమాల్లో యముడి కేరెక్టర్ కనిపిస్తే సినిమా హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికే తెలుగులో యముడు, యమలోకం బ్యాక్ డ్రాప్ లో అనేక సినిమాలు రిలీజ్ అయి మంచి హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలో కొన్ని యముడి సినిమాలు అయితే బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు కూడా సాధించి పెట్టాయి. అంతేకాదు సంబంధం లేకపోయినా సూర్య సింగం సినిమాకు యముడు టైటిల్ పెడితే అది కూడా బాగానే వర్కౌట్ అయింది. అయితే ఎందుకో ఈ మధ్య కాలంలో యముడు, యమ లోకం అనే కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు. అయితే ఇప్పుడున్న వీఎఫ్ఎక్స్, టెక్నాలజీతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు యముడిని, యమలోకాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. జగన్నాధ పిక్చర్స్ బ్యానర్ మీద జగదీష్ ఆమంచి స్వీయ దర్శకత్వంలో అందరూ కొత్త నటీనటులతో ‘యముడు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Rithu Chowdary: లవ్లో ఫెయిలైన జబర్దస్త్ భామ.. త్వరలో అన్నీ బయటపెడుతుందట!
ధర్మో రక్షతి రక్షితః అనే టాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ మోషన్ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. సృష్టి, లయ, స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో లోక సంరక్షకుడు అయిన మహా విష్ణువు వేద, మిత్ర, గురు సార ధర్మములు కాపాడడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడని మనకి తెలుసు. కానీ కలియుగంలో మనిషి ధర్మధర్మాలను మరచి సృష్టి వినాశనానికి కారణం అవుతున్నాడు, అప్పుడు ధర్మానికి రాజైన యమధర్మ రాజు దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి భూమి మీద అవతరించాలని తలిస్తే? గరుడ పురాణంలో చేప్పబడిన విధంగా నరకలోకంలోని శిక్షలు భూమి మీద అమలు పరిస్తే? వస్తున్నాడు యముడు అంటూ భయపెట్టేలా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కిష్ణు కెమెరా మాన్ గా వ్యవహరిస్తుండగా భవాని రాకేష్ సంగీతం అందిస్తున్నారు. నటీనటుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.