NVSS Prabhakar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంబరాలు ఎవరి కోసం చేస్తున్నారని వారికే అర్థం కావడం లేదని, సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన కొద్దీ గంటలకే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. దేశంలోనే వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకు వేయలేదని, రాజకీయంగా మాదిగలను ముంచింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. సబ్ ప్లాన్ ను ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తుంటే ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ నోరు మెదపడం లేదని, మాలలను ఒక కాంగ్రెస్ నాయకుడు రెచ్చ గొడుతున్నారన్నారు. మాదిగలను ఒక వెైపు ముంచి.. మరో వెైపు మాలలను రెచ్చ గొడుతున్నారని, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ విధానం స్పష్టం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ “BE 6E”పై ఇండిగో కేసు.. వివాదం ఏంటంటే..?
అంబేద్కర్ ను చట్ట సభల్లో అడుగు పెట్టకుండా ఓడించి, అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని, ఏడాది సబ్ ప్లాన్ అమలు తీరు తెన్నలపై రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. 6 అబద్ధాలు, 66 మోసాలతో బిజేపీ వేసిన ఛార్జ్ షీట్ కి కాంగ్రెస్ సమాధానం చెప్పలేకపోతుందన్నారు. అంతేకాకుండా.. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ ఏమీ సమాధానం చెబుతారని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ చెయ్యకుండా పబ్బం గడుపుకున్నారని, ఎస్సీ వర్గీకరణను దేశంలో అమలు చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతానని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. ఛార్జ్ షీట్ పెట్టే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
38th National Games: జాతీయ క్రీడల షెడ్యూల్ షురూ.. ఎప్పుడు, ఎక్కడంటే?