Mallu Bhatti Vikramarka: ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. 2017లో హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య దేశాన్ని కుదిపేసిందని గుర్తు చేస్తూ.. ఆ ఘటన వెనుక ఉన్న అసలు బాధ్యులను దేశ ప్రజలముందు నిలబడే చర్యనే అతి పెద్ద ప్రశ్నగా ఆయన అభివర్ణించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 2017 లో రోహిత్ వేముల ఆత్మహత్య దేశాన్ని షేక్ చేసింది. సూసైడ్ లేఖలో రోహిత్…
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రోజు మన అందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ అన్నారు.. 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని.. చదువుకోవాలనే ఆశ ఉండే పిల్లలందరినీ చదివిస్తామని హామీ ఇచ్చారు. తొందర్లోనే మంచి స్కీంను తీసుకొస్తామని తెలిపారు. అమరావతికి దేశంలోని మంచి…
బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ మత స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన 84వ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం, మన ఐడియాలజీ మనమే కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ రాజ్యాంగమని.. అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇది తన బాధ్యత అన్నారు.
Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితులను అవమానించే పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ లాంటి గొప్ప దళిత నాయకులను అడుగడుగునా అవమానించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఇందిరా గాంధీ నేతృత్వంలో దళితుడు ప్రధాని అవతాడన్న పరిస్థితి ఏర్పడుతుందని భయపడి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారని బండి సంజయ్ ఆరోపించారు. “దళితులకు నిజంగా అండగా…
RK Roja: నగరిలో జరిగిన దళితుల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు ఆమె. దళితులను ఊర్లో రానివ్వమని, తిరగకూడదని, ఊరి నుండి వెలివేయాలని హుకుం జారీ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు దళితులపై భౌతిక దాడులు చేసి, వారి ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా, బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం ఏ విధమైన న్యాయం? అంటూ రోజా ప్రశ్నించారు.…
NVSS Prabhakar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంబరాలు ఎవరి కోసం చేస్తున్నారని వారికే అర్థం కావడం లేదని, సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన కొద్దీ గంటలకే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. దేశంలోనే వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకు వేయలేదని, రాజకీయంగా మాదిగలను…
కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టైటానిక్ పడవ ను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారన్నారు.