వైన్ షాపులు బంద్:
భారతీయులు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని అందుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ చుట్టూ భారీ బందోబస్త్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు వైన్ షాపులను కూడా బంద్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఐదో రోజుకు చేరిన కోటి దీపోత్సవం:
భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా కోటి దీపోత్సవం విజయవంతంగా సాగుతోంది. కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు. అదే ఒకే చోట.. ఓ వెలుగుల ఉత్సవం జరిగితే.. వేలాది మంది ఒకేచోట చేరి.. దీపాలు వెలిగిస్తే.. అది దీపయజ్ఞం అవుతుంది. అదే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం అవుతుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఇల కైలాసంగా మారిపోయింది. ఇప్పటికే ఐదు రోజుల పాటు నిర్వహించిన విశేష కార్యక్రమాలు కలుపండుగా సాగాయి. నేడు ఆరవ రోజు కోటిదీపోత్సవ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న దీపయజ్ఞం.. కోటిదీపోత్సవంలో పాన్గొనేందుకు రండి.. తరలిరండి అని ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. భక్తులకు కావాల్సిన పూజా సామగ్రిని కూడా రచనా టెలివిజన్ ఉచితంగా అందజేస్తున్న విషయం విదితమే.
ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్‌బాస్:
బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే.. హౌస్ మేట్స్ లో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. శనివారం నాగార్జున అందరిని ఎంటర్టైన్ చెయ్యడంతో పాటుగా.. అందరికీ క్లాస్ పీకాడు. ముందుగా హౌస్ పెద్ద దిక్కు అయిన శివన్నకు నాగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఎలిమినేషన్ చూస్తే.. ఈ వారం ఎవరు మూటాముళ్లె సర్దుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టడం.. అది యావర్ గెల్చుకోవడంతో ఎలిమినేషన్ మరింత ఉత్కంఠగా మారింది.
నేడు వన్డే ప్రపంచకప్ ఫైనల్:
వన్డే ప్రపంచకప్ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. 45 రోజుల్లో 48 మ్యాచ్‌ల తర్వాత.. జగజ్జేతను తేల్చే ఫైనల్ పోరుకు సమయం వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆరంభం కానుంది. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మూడో టైటిల్‌పై దృష్టి పెట్టిన భారత్.. ఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాపై గెలిచి 2003 ఫైనల్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు ఆరోసారి టైటిల్ గెలవాలని ఆసీస్ చూస్తోంది.
స్థిరంగా బంగారం ధరలు:
బంగారం కొనుగోలు చెయ్యాలని భావించే వారికి గుడ్ న్యూస్. మార్కెట్ లో ఈరోజు పసిడి ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇక వెండి మాత్రం ఊరట కలిగిస్తుంది. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,690 గా ఉంది. వెండి కిలో ధర రూ.500 మేర తగ్గి.. 76,000 లుగా కొనసాగుతోంది.