ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయ్.. డౌన్ లోడ్ చేసుకోండి

తెలంగాణ ఎంసెట్ హాల్ టిక్కెట్లను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనివెల్లడించారు. MSET అగ్రికల్చర్, మెడికల్ మరియు ఇంజనీరింగ్ పరీక్షలు మే 10 నుండి 14 వరకు నిర్వహించబడతాయి. విద్యార్థులు హాల్ టిక్కెట్లను eamcet.tsche.ac.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి.. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత గల పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ కావాలి. తెలంగాణ ఎంసెట్ పరీక్షలను JNTU హైదరాబాద్ నిర్వహించనుంది. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎంసెట్ పరీక్షలు మే 10, 11, 12, 13, 14 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు మే 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షలు మే 12, 13, 14 తేదీల్లో జరుగుతాయి. . పరీక్షలు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.. మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు జరుగుతాయి.
రజనీకాంత్ కు వైసీపీ నేతలు సారీ చెప్పాలి

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా రజనీకాంత్ చేసిన ప్రసంగంపై వైసీపీ నేతలు, మంత్రులు ఒక స్థాయిలో ధ్వజమెత్తారు. తీవ్రంగా విమర్శలు చేశారు. వైసీపీ నేతల తీరు, రజనీకాంత్ పై వైసీపీ నేతల విమర్శలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. రజనీకాంత్ పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి. జగన్ ప్రభుత్వం పై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలు చేస్తోంది.అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం.సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి.వైసీపీ ప్రభుత్వ పోకడలపై రజనీ చిన్న విమర్శ చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదు.వివిధ అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు.
చొక్కా విప్పి జేసీ హల్‌చల్..కేతిరెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్

జేసీ ప్రభాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లాలో ఆయనో స్పెషల్.. మాజీ ఎమ్మెల్యేగానే కాదు ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా ఆయన అందరికీ చిరపరిచితుడు. అధికార పార్టీపై ఆయన విమర్శలు చేస్తుంటారు. సమస్యలపై పోరాటం చేస్తారు. ఆయన తన ఆఫీసులోనే నిరసన వ్యక్తం చేస్తారు. మునిసిపల్ ఆఫీసులోనే స్నానాలు చేశారు. మునిసిపల్ కమీషనర్ అవినీతిపై ధ్వజమెత్తారు. ఇవ్వాళ మరో అడుగు ముందుకేశారు. అర్ధనగ్న ప్రదర్శన ఇచ్చారు. చొక్కా విప్పి హల్‌చల్ చేశారు. అక్కడితో ఆగలేదు- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి- జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇసుక అక్రమ రవాణా, మున్సిపాలిటీలో డీజిల్ దుర్వినియోగం వంటి అంశాల మీద ఈ ఇద్దరు నేతల మధ్య మాటల దాడి తారస్థాయికి చేరుకుంది. అదికాస్తా ఫ్లెక్సీలపైకీ ఎక్కింది. తాడిపత్రి మున్సిపాలిటీలో డీజిల్‌ను ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టానుసారంగా, తన సొంత అవసరాల కోసం వాడుకుంటున్నాడంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు. అయితే అసలు డీజిల్ దొంగ ఎవరో తేలాలంటున్నారు జేసీ. తాడిపత్రి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న డీజిల్ వినియోగానికి సంబంధించిన లెక్కలను వివరిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి.
ఉద్యోగాల పేరుతో వల.. లక్షల్లో మోసం చేసిన కేటుగాడు

ఉద్యోగం.. నిరుద్యోగులకు వరం లాంటిది. ఆర్థిక ఇబ్బందులతో, ఇంట్లో తల్లిదండ్రుల పోరు భరించలేక ఎక్కడో చోట ఉద్యోగం చేయాలని భావిస్తారు నిరుద్యోగులు… ఎక్కడైనా ఉద్యోగం ఉందని ప్రకటన వస్తే దానిని చూసి అప్లై చేస్తారు.. లక్షల్లో జీతం అని మాయచేసి బిచాణా ఎత్తేసే కేటుగాళ్ళు ఉంటారు. విశాఖలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన కేటుగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు పేరుతో నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్న తులసి రామ్ అనే వ్యక్తి వారిని నిలువునా ముంచేశాడు. ఇన్కమ్ టాక్స్ ఉద్యోగాలు, జిఎస్టి, హెచ్ పీ సీఎల్, కస్టమ్స్ డిపార్ట్ మెంట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ. లక్షల్లో మోసం చేశాడు. నిరుద్యోగ యువతే తులసి రామ్ టార్గెట్. డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల ఫేక్ జాయినింగ్ లెటర్స్, నకిలీ సంతకాలు పెట్టి యువతకి మాయలో దింపి లక్షల వసూలు చేస్తున్నాడు ఆ కేటుగాడు. తులసిరాంపై పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితులు కంచరపాలెం పోలీస్, ఫోర్త్ టౌన్, గోపాల్ పట్నం పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
మహిళతో జార్ఖండ్ మంత్రి వీడియో కాల్

జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా వివాదంలో చిక్కుకున్నారు. వీడియో కాల్ ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. ఓ మహిళతో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మంత్రి నిర్వాకంపై దర్యాప్తు జరపాలని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జార్ఖాండ్ మంత్రి ఒకరు ఓ మహిళతో వీడియా కాల్ ద్వారా అసభ్య సంభాషణ జరిపినట్లుగా వెలుగు చూడటం సంచలనం రేపింది. ఈ కాగా ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేత రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా ఫోన్ లో ఓ మహిళతో మాట్లాడారు. వారిద్దరు మధ్య అసభ్యకరమైన సంభాషణ జరిగినట్లుగా నెట్టింట వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. కాంగ్రెస్ స్వభావం ఇదేనని.. ఇది జార్ఖాండ్ మంత్రి తీరు అని.. మహిళల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నందుకు కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.ఈ ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ ఇందుకు సంబంధించి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది నిజమైతే మంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై మంత్రి బన్నా వివరణ ఇచ్చారు. తనపై అసత్య ప్రచారం చేయడంలో భాగంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇది ఎడిట్ చేసిన వీడియో అని క్లియర్ గా అర్థమవుతుందని.. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని మంత్రి బన్నా చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.
నా లవర్ వదిలేశాడు.. పంజాగుట్ట శ్మశానంలో యువతి న్యూసెన్స్

ఆదివారం పంజాగుట్టలో ఓ యువతి హల్ చల్ చేసింది. పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద అర్ధరాత్రి ఓ యువతి వీరంగం సృష్టించింది. రెండు గంటలపాటు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు గొడవ జరిగింది. ప్రేమికుడు తనను విడిచిపెట్టాడని శ్మశానంలో కన్నీరుపెట్టుకోవడం ప్రారంభించింది. అంతేకాదు కాసేపటికి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. యువతి హంగామా చేస్తుండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని శ్మశాన వాటిక నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యువతికి బహిరంగంగా బీభత్సం సృష్టించడంపై పోలీసులు కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించనున్నారు. యువతి అర్థరాత్రి వీరంగం సృష్టించడంతో ఏమైందని స్థానికులు ఆమెను ప్రశ్నించారు. ప్రేమించిన అబ్బాయి తనను వదిలేశాడని, అతని లేని జీవితం నేను ఊహించుకోలేనని చెప్పుకొంచ్చింది.
భారత్ లో ఆ 14 మొబైల్ యాప్స్ బ్లాక్..

కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతపై పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి అనుమానితమైన చర్యలు కనిపించిన వాటిపై ఉక్కుపాదంమోపుతుంది. తాజాగా అనుమనిత మొబైల్ యాప్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి దూకుడు పెంచింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ యాప్ లను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ యాప్ ల ద్వారా ఉగ్రవాదుల, ఉగ్రవాదుల మద్దతుదారులకు నడుమ కమ్యూనికేషన్ క్షేత్రస్థాయిలో దాడుల ప్రణాళికల చేరవేత, మరీ ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి సూచనల రాకపోకలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేకించి జమ్ము కశ్మీర్ లో ఈ యాప్ ల వినియోగం ఎక్కువగా ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలోనే 14 మేసేజింగ్ యాప్ లను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర సర్కార్ తెలిపింది. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్వ్సిస్, విక్రమ్ , మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్, నంద్ బాక్స్, కోనియన్, ఏఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్ లను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఐపీఎల్ లో అదరగొడుతున్న విదేశీ ఆటగాళ్ళు

ఐపీఎల్ 16వ సీజన్ ఇప్పటివరకు సగానికి పైగా లీగ్ మ్యాచ్‌లు అయిపోయాయి. ఈ సీజన్‌లో కూడా భారత ఆటగాళ్లతో పాటు పలువురు ఫారిన్ ప్లేయర్స్ కూడా తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. వీరు తాము ఆడుతున్న జట్లను ఒంటిచేత్తో గెలిపించాలని చూస్తున్నారు. ఇందులో డెవాన్ కాన్వే, జోస్ బట్లర్, రషీద్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 1. జోస్ బట్లర్ : గత ఐపీఎల్ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన జోస్ బట్లర్ ఈ సీజన్‌లోనూ బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బట్లర్ ఇప్పటి వరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 33.88 సగటుతో 3 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. మొత్తం 271 పరుగులు చేశాడు. బట్లర్ ఇప్పటివరకు 143.39 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు. 2 డెవాన్ కాన్వే : చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగమైన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బ్యాట్‌తో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కాన్వే బ్యాట్‌తో 9 ఇన్నింగ్స్‌లలో 59.14 అద్భుతమైన సగటుతో మొత్తం 414 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్‌లో కాన్వే జట్టుకు ఇప్పటి వరకు శుభారంభం అందించిన తీరుతో సీఎస్కే మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఈ సీజన్‌లో కాన్వే 5 అర్ధ సెంచరీలు చేశాడు.
నన్ను అడగడం కాదు.. ఇదే ప్రశ్న హీరోలను అడగగలరా?

హీరోయిన్ శ్రియ శరణ్ తొలిసారి తన అసహనాన్ని బయటపెట్టింది. తన అందం గురించి ఓ రిపోర్టర్ చేసిన వ్యాఖ్య ఆమెకు కోపం తెప్పించింది. శ్రియా శరణ్ చాలా సౌమ్యురాలు. ఆమె సహనం కోల్పోయి కోపాన్ని ప్రదర్శించిన సందర్భాలు లేకపోలేదు. వారు దేన్నీ పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. తనపై వస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదు. ఓ సందర్భంలో ఆమెకు కోపం వచ్చింది. హీరోలను టార్గెట్ చేస్తూ పరుష ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన తర్వాత కూడా ఇంత అందంగా ఉండడానికి కారణం ఏమిటి? అని విలేకరి అడిగాడు. దీనికి శ్రియ స్పందిస్తూ… హీరోయిన్లను మాత్రమే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు? హీరోలను అడిగే ధైర్యం ఉందా? అతను అడిగాడు. నా అందాన్ని చూసి నా స్నేహితులు నన్ను మెచ్చుకుంటారు. పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను గొప్పవాడని స్తుతిస్తారు. ఇక్కడ అందం ఒక్కటే ముఖ్యం కాదు వయసు?. ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం అయింది? ఇలాంటివి హీరోలను అదే ప్రశ్న అడిగే ధైర్యం మీకు లేదు.