Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju-Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ పర్యటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ వెళ్లే బదులు రాంచీకి వెళ్లి ఉండాల్సిందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎద్దేవా చేశారు. రాహుల్ ఓ పెద్ద తప్పు చేశారని, అయితే మనుషులన్నాక తప్పులు చేయడం సహజమేనంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టడంపై కేంద్రం, విపక్షాల మధ్య నడుస్తున్న వివాదం నేపథ్యంలో ఈ చర్చ జరిగింది.
మహిళల భావ ప్రకటన స్వేచ్ఛపై రాహుల్ గాంధీ షేర్ చేసిన ఒక వీడియోపై రిజిజు స్పందిస్తూ, ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరడంతో ఈ రగడ మొదలైంది. దీనికి ప్రతిగా, అసలు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో ఎందుకు లంకె పెడుతున్నారంటూ రాహుల్ గాంధీ నిలదీశారు. కాగా, శనివారం (ఆగస్టు 8) ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడి ‘ఛాత్రోంకీ గూంజ్’ (విద్యార్థుల గళం) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై, దాని విధానాలపై విరుచుకుపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే దేశంలో నేడు యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు.
Also Read
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
తన ప్రసంగంలో ప్రధానంగా మూడు అంశాలపై మాట్లాడాలనుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. అవి – బాధ, డేటా, సంపద. యువత పడుతున్న బాధలు, వారు ఉత్పత్తి చేస్తున్న డేటా గురించి తాను మాట్లాడుతున్నానని, అయితే అసలు సమస్య ఏమిటంటే.. యువతకు చెందాల్సిన సంపద ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగా వారికి అందడం లేదని అన్నారు. నేటి యువత ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్ చూడటం 21వ శతాబ్దపు ఒక కొత్త రకం వ్యసనంగా మారిందని విమర్శించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి చదువుకున్నా ఉద్యోగాలు రాకపోవడంతో, బ్లింకిట్, ఉబెర్ వంటి కంపెనీల్లో రోజుకు పది గంటల పాటు రోజువారీ కూలీల్లా పనిచేయాల్సి వస్తోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..