Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fauji: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ఫౌజీ’ (Fauji) ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావస్తుండగా, అంచనాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఇప్పడు అభిమానులు మరో అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా గురించి ఆగస్టు 15న చిత్ర బృందం ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందా అనే చర్చ మొదలైంది అభిమానుల్లో. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుండటంతో ‘ఫౌజీ’ నుంచి ప్రత్యేకమైన గ్లింప్స్ విడుదల చేస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చిత్ర బృందానికి ఇదే తరహాలో విజ్ఞప్తులు కనిపిస్తున్నాయి. సినిమా కథకు స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యం ఉండటంతో ఆగస్టు 15 సందర్భంగా ఒక ప్రత్యేక వీడియో విడుదల చేయవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ‘ఫౌజీ’ చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షూటింగ్‌ను పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు వేగంగా పనులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషనల్ ప్లాన్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, అభిమానులలో మాత్రం అప్డేట్ కోసం ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవల విడుదలైన ‘ఫౌజీ’ పోస్టర్ కూడా మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. దానికి కొనసాగింపుగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఒక గ్లింప్స్ లేదా పవర్ఫుల్ ప్రోమో వస్తే సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్‌ను పీరియడ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చూడబోతున్న ప్రేక్షకులకు ఈ సినిమాపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ప్రస్తుతం ‘ఫౌజీ’ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా, ఆగస్టు 15న నిజంగానే ప్రత్యేకమైన అప్డేట్ వస్తుందా లేదా అనేది మాత్రం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అభిమానుల అంచనాలు మాత్రం ఇప్పటికే పీక్స్‌కు చేరుకున్నాయి. మరి ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘ఫౌజీ’ టీమ్ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి కథానాయికగా పరిచయమవుతుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రాహుల్ రవీంద్రన్, భానుచందర్, చైత్ర జె. ఆచార్ వంటి నటీనటులు ఈ పీరియాడిక్ వార్ డ్రామాలో నటిస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!