తమిళనాట బిల్లుల లొల్లి.. గవర్నర్ల తీరుపై విమర్శలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వ్యవహారం కొసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల విషయంలో గవర్నర్లు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. తాజాగా తమమిళనాడు గవర్నర్ రవి తీరుపై అధికార డీఎంకే నాయకులు విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ రవి చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ టీఎన్ రవి మధ్య అనేక సమస్యలపై వాగ్వాదం చోటుచేసుకోవడంతో, డీఎంకే సీనియర్ మంత్రి దురై మురుగన్ అసెంబ్లీలో గవర్నర్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేందుకు గడువును నిర్ణయించాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. సభా వేదికపై భారమైన హృదయంతో, ముఖ్యమంత్రి తమ పార్టీకి ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారని మంత్రి దురై మురుగన్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో గందరగోళం తలెత్తడానికి గవర్నర్‌లు కారణమనే అంశాన్ని ఆయన ఎత్తి చూపారు. ఆ పదవి ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తుందన్నారు. గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న తరుణంలో, మీరు భారత పౌరుడిగా ఉండటానికి అర్హులు కాదన్నారు. మీకు రాజకీయ భావజాలం ఉంటే నిష్క్రమించండి అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. కావాలంటే బీజేపీలో చేరవచ్చు అంటూ గవర్నర్‌పై మంత్రి మండిపడ్డారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై కూర్చునే అవకాశం గవర్నర్‌కు రాజ్యాంగం కల్పించలేదన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలనేది నా అభిప్రాయం అని డీఎంకే మంత్రి పేర్కొన్నారు.
అంబాజీపేటలో బాలికపై పాస్టర్ ఘాతుకం

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరం జరిగింది. ప్రార్థనలు చేసి అందరికీ స్వాంతన చేకూర్చే పాస్టర్ అకృత్యానికి పాల్పడ్డాడు. అంబాజీపేట (మం) పుల్లేటికుర్రులో బాలికపై అకృత్యానికి పాల్పడ్డారు పాస్టర్ బెజవాడ హోసన్న. బాలికను గర్భవతిని చేసి పుట్టిన బిడ్డను మాయం చేశాడా పాస్టర్. ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనంగా మారింది. పుల్లేటికుర్రు శివారు చీకురుమిల్లివారి పేటలో పాస్టర్ బెజవాడ హోసన్న నిర్వహించే చర్చిలో సభ్యురాలిగా 17 ఏళ్ల బాలిక ఉంది. తల్లి లేని బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు పాస్టర్. గత నెల ఐదున మగ బిడ్డకు జన్మనిచ్చింది మైనర్ బాలిక. తన పాపం బయటపడకుండా ఆ బాలికకు పుట్టిన వెంటనే బిడ్డను మాయం చేశాడు పాస్టర్. నెల రోజులు గడుస్తున్నా బిడ్డ ఆచూకీ లేకపోవడంతో బాలిక బంధువులు అనుమానం వ్కక్తం చేశారు. బిడ్డను అమ్మేసి ఉంటాడని లేదా చంపేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ , ఎస్పీలకు బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మగశిశువు ఏమయ్యాడో దర్యాప్తు చేయాలని బాలిక బంధువులు కోరుతున్నారు.
గవర్నర్ తీరుపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

బీజేపీ రాష్ట్రాలపై కక్ష సాధింపు కోసమే గవర్నర్లను వాడుకుంటున్నారని ఐటీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అత్యున్నత రాజకీయ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. ఇది దేశ అభివృద్ధికి సహాయపడే సహకార సమాఖ్య నమూనానా? ఇదేనా టీమ్ ఇండియా స్ఫూర్తి? అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న తరుణంలో గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు. రెండు బిల్లులను తిప్పి పంపించారు. మరో రెండు బిల్లులను పెండింగ్‌లో పెట్టారు. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిని చేర్చారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.
చైతన్యమూర్తి, మార్గదర్శి పూలే

నేడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. చైతన్యమూర్తి పూలే.అవిభక్త భారతదేశంలో అంటరానితనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై పోరుసల్పిన తొలినాటి యోధుడు జ్యోతిరావు పూలే.సామాజిక ప్రజాస్వామ్యం అనే నినాదాన్ని ఎలుగెత్తి చాటి అటువంటి ప్రజాస్వామ్యం కోసం కలలుగన్న గొప్ప సంఘ సంస్కర్త పూలే.నేడు ఆ మహానుభావుని జయంతి అని ప్రకటన విడుదల చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆయన సేవా నిరతి, అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవాజ్యమైన ప్రేమాభిమానాలను మననం చేసుకుంటూ ఆ మార్గదర్శికి ప్రణామాలు అర్పిస్తున్నాను.ఆడబిడ్డలకు చదువు ఎంతో ముఖ్యమని నమ్మి వారి విద్యాభివృద్ధికి అహరహం శ్రమించిన గొప్ప సంస్కర్త.వితంతువుల బిడ్డలు అనాథలు కాకూడదని నమ్మి వారికి అండగా నిలబడిన నిస్వార్ధ సేవకుడు.జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచనా విధానం పూలే ఆలోచనలకు దగ్గరగా ఉండే సూత్రం.ఆ మహనీయుని అడుగు జాడల్లో జనసేన ప్రస్థానం కొనసాగుతుందన్నారు.
2024లోనూ జగనన్న వన్స్ మోర్ అంటున్నారు

పల్నాడు జిల్లాలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఊపుమీద సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు,, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు.‘ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లడం సాధారణంగా జరిగేది. కానీ అందుకు విరుద్దంగా ప్రజల వద్దకే మంత్రులు, ఎమ్మెల్యేలు రావడం అంటే అది కేవలం ఒక్క జగనన్న వల్లే సాధ్యమైంది’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు. జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా కామెంట్లు చేశారు. విపక్షాలపై ఆమె మండిపడ్డారు. 2024 లో జగనన్నను వన్స్ మోర్ అంటూ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 16 మంది ముఖ్యమంత్రు ల కన్నా మిన్నగా పాలిస్తున్నాడు జగనన్న…అలాంటి జగన్ పై నీతిమాలిన రాజకీయాలు చేయాలని చూస్తే టిడిపి ,జనసేన లను తరిమి తరిమి కొడతాం…వైసీపీ నాయకులతో మంచికి మంచి ఉంటుంది, చెడుకు చెడు ఉంటుందన్నారు.
హవ్వ.. యూనిఫాం ఎలుకలు కొరికేశాయట..

వినేవాడు వుండాలే గానీ చెప్పేవాడు వేదాంతం చెబుతాడు. బంగారాన్ని ఎలుకలు, పందికొక్కులు తినేస్తాయి. వైన్ షాపుల్లో మందు కూడా ఎలుకలే తాగేస్తుంటాయి.. వేల కోట్ల రూపాయల దాణాను చిటికెలో పశువులు తినేస్తాయి.. సినిమాల్లో చూపించినట్టు పోలీస్ గన్ ఎవరో ఎత్తుకుపోతారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తిరుపతిలో యూనిఫాం లేకుండా సమావేశానికి వచ్చిన ఓ వీఆర్వో ఇచ్చిన సమాధానం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తిరుపతిలో యూనిఫాం ఎలుకలు కోరికేశాయ్ మేడం అంటూ బదులిచ్చాడు వీఆర్వో. ఈ నిర్లక్ష్యపు సమాధానంతో వీఆర్వోపై సస్పెన్షన్ వేటు పడింది. సచివాలయ ఉద్యోగులతో నగర సమస్యలపై జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు తిరుపతి కమీషనర్ హరిత. అయితే ఈ సమావేశానికి అంతా హాజరయ్యారు. కానీ యూనిఫారం లేకుండా హాజరయ్యాడు వీఆర్వో ప్రసాద్. అందరూ యూనిఫారంతో వచ్చారు నీవు ఎందుకు రాలేదని ప్రశ్నించారు కమీషనర్ హరిత. నా యూనిఫాం ఎలుకలు కోరికేశాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు వీఆర్వో. ఇటు పనిలోను వెనుకంజులో ఉండటం, నిర్లక్ష్యపు సమాధానంపై సీరియస్ అయ్యారు కమీషనర్. వీఆర్వోను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు నగర కమీషనర్ హరిత. ఈ ఘటన తిరుపతిలో హాట్ టాపిక్ అవుతోంది.
ఆసక్తి రేకెత్తిస్తున్న శ్రద్ధాపర్వం

వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న చిత్రం ‘పారిజాత పర్వం’. సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు. ఓ అమ్మాయికి ముసుగు వేసి చైర్ లో బంధించినట్లున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ మీద క్యూరియాసిటీని పెంచుతోంది. బాల సరస్వతి కెమరామెన్ గా పని చేస్తున్న ‘పారిజాత పర్వం’ మూవీకి రీ సంగీతం అందిస్తున్నారు. శశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా, ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి అనంత సాయి సహ నిర్మాత. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్ , గుండు సుదర్శన్ తదితరులు పోషించారు.
మరో వివాదంలో ఆదిపురుష్.. తన ఆర్ట్ కాపీ కొట్టారంటూ..

ఏ ముహూర్తాన ఆదిపురుష్ సినిమాను ప్రారంభించారో తెలీదు కానీ.. ఆది నుంచి ఇది వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మొదట టీజర్ విడుదల అయినప్పుడు.. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో పాటు హిందూ సంఘాలూ దుమ్మెత్తిపోశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ టీజర్‌లో పాత్రల్ని చూపించారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు.. చాలా రోజుల పాటు ఈ వివాదం నడిచింది. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌పై కూడా సినీ ప్రియులు పెద్దఎత్తున దుమ్మెత్తిపోశారు. పోస్టర్ డిజైన్ దారుణంగా ఉందని, ఏమాత్రం ఆకట్టుకోలేదని తిట్టారు. ఇవి చాలవన్నట్టు.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ‘కాపీ’ వివాదంలో చిక్కుకుంది. ఆదిపురుష్ చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్ రాముని లుక్, తన ఆర్ట్ వర్క్‌ను చూసి కాపీ కొట్టారని ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ ఆరోపించాడు. ప్రభాస్ లుక్, తన ఆర్ట్ వర్క్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆదిపురుష్ మూవీ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన అనుమతి లేకుండా తన ఆర్ట్‌ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించాడు. ‘‘నేను భారత్‌కు చెందిన ఆర్టిస్ట్‌ని. రామాయణ ఇతిహాసంలోని శ్రీరాముడి రూపం కోసం నేను నా అన్వేషణను ప్రారంభించా. ఏడాది క్రితమే అది జరిగింది.