Nothing Phone 3: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Phone 3 ను జూలై 1న భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేయనుందని ప్రకటించింది. అలాగే ఈ ఈవెంట్‌లో కంపెనీ తన తొలి ఓవర్-ఇయర్ ఆడియో ప్రోడక్ట్ Nothing Headphone 1 ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ప్రకటన ఇటీవల లీకైన డిజైన్ లీకులు, హార్డ్‌వేర్ రూమర్లను నమ్మేలా చేస్తుంది.
Read Also: Rahul Gandhi: 19న రాహుల్ గాంధీ బర్త్‌డే.. యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
నథింగ్ ఫోన్ 3 లో కొత్త Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. నథింగ్ సీఈఓ కార్ల్ పే తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ప్రాసెసర్ గతంలో ఉపయోగించిన Snapdragon 8+ Gen 1 తో పోలిస్తే CPUలో 36%, GPUలో 88% పెరుగుదల చూపుతుందని తెలిపారు. ఫలితంగా ఈ ఫోన్ మరింత వేగంగా, మృదువుగా పనిచేస్తుందని తెలిపారు.
లీకైన సమాచారం ప్రకారం, నథింగ్ ఫోన్ 3లో 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశముంది. ఫోన్ రియర్ సైడ్‌లో మూడు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 50MP ప్రాథమిక సెన్సార్ (OIS) అలాగే మిగతా కెమెరాలు అల్ట్రా వైడ్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లుగా ఉండే అవకాశముంది. ఫోన్ బ్యాటరీ పరంగా కూడా భారీగా ఉంటుందని, 5000mAh కన్నా ఎక్కువ సామర్థ్యంతో వస్తుందని అంచనా.
Read Also: KA Paul: ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి.. లేదంటే నేను రంగంలోకి దిగుతా..!
లీకైన చిత్రాల ప్రకారం, నథింగ్ ఫోన్ 3 గత మోడళ్ల మాదిరిగానే స్పష్టమైన ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ డిజైన్ తో వస్తుంది. అయితే, ఈసారి నథింగ్ మొబైల్ ప్రత్యేక లక్షణమైన Glyph ఇంటర్ఫేస్ ఉండకపోవచ్చని సమాచారం. ఇది బ్రాండ్ డిజైన్‌లో ముఖ్యమైన మార్పుగా భావించవచ్చు. ఇక నథింగ్ ఫోన్ 3 రెండు వేరియంట్లలో విడుదల కానుంది. అందులో 12GB RAM + 256GB స్టోరేజ్ ధర USD 799 (సుమారు 68,000), 16GB RAM + 512GB స్టోరేజ్ ధర USD 899 (సుమారు 77,000) గా ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ భారత్‌లో ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించబడుతుంది.