Mukesh Ambani: జీతాలు లేకుండానే పనిచేస్తున్న అంబానీ వారసులు.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను నియమించిన సంగతి తెలిసిందే. బోర్డులో చేరిన వారికి ఎలాంటి జీతమూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుము మాత్రమే చెల్లించబడుతుందని కంపెనీ తన బోర్డులో వారి నియామకానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఒక తీర్మానంలో పేర్కొంది. ఈ మేరకు వాటాదారుల అనుమతి కోరుతూ ఓ ప్రపోజల్‌ను డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. ముకేశ్ అంబానీలాగే సంపాదించే లాభాలపై వారు కమీషన్ పొందుతారు. ముకేశ్ అంబానీ(66) 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోలేదు. ముఖేశ్ అంబానీ స్వయంగా ఐదేళ్ల పాటు ఛైర్మన్‌గా, సీఈవోగా కొనసాగుతారు. తాజాగా బోర్డులో చేరిన ఆకాశ్, అనంత్, ఈషా అంబానీలకు సైతం జీతం ఉండదు. ఆయన బంధువులు నిఖిల్, హితల్‌తో సహా ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లకు జీతం, అనుమతులు, అలవెన్సులు, కమీషన్ చెల్లిస్తారు.
Also Read: World Cup 2023: వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు వెళ్లే జట్లు ఇవే..?
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ఆయన ముగ్గురు పిల్లలు – కవలలు ఆకాష్, ఇషా (ఇద్దరూ 31 సంవత్సరాలు), అనంత్ (28 సంవత్సరాలు) – కేవలం సిట్టింగ్ ఫీజు, సంస్థ సంపాదించిన లాభంపై కమీషన్ పొందుతారు. ముఖేశ్ అంబానీ తన విశాలమైన రిలయన్స్ సామ్రాజ్యాన్ని తన ముగ్గురు పిల్లలకు పంచారు. ఇషా అంబానీ రిటైల్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తుండగా.. ఆకాష్ టెలికాం విభాగాన్ని చూసుకుంటున్నారు. చిన్నవాడైన అనంత్ కొత్త ఇంధన వ్యాపారానికి సారథ్యం వహిస్తున్నారు. ముఖేశ్ అంబానీ పిల్లలు గతేడాది నుంచి రిలయన్స్ కంపెనీలో కీలక బాధ్యత పోషిస్తున్నారు. అయితే ఈ ఏడాది రిలయన్స్ బోర్డులోకి అనుమతించారు. గత నెలలో రిలయన్స్ వార్షిక సమావేశం (AGM) జరుగగా, అందులో ఇషా అంబానీ, అనంత్, ఆకాశ్ అంబానీలను బోర్డు సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బోర్డులో నియామకమైన వీరు డైరెక్టర్స్ హోదాలో పని చేయనున్నారు. వారి తల్లి నీతా అంబానీ 2014లో ఆర్‌ఐఎల్ బోర్డులో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమెకు జీతం కూడా లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బోర్డు సమావేశానికి హాజరైనందుకు నీతా అంబానీకి పారితోషికం కింద రూ.6 లక్షలు. కమీషన్ కింద రూ.2 కోట్లు చెల్లించారు.
Also Read: Disney+ Hotstar: పాస్‌వర్డ్ షేరింగ్‌కి హాట్‌స్టార్ గుడ్ బై.. షేర్ చేస్తే కఠిన చర్యలు..
వారసత్వ ప్రణాళికలో భాగంగా, నీతా రిలయన్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా చేయబడ్డారు. ఈ హోదాను బోర్డులో ఎవరూ అనుభవించరు. ముఖేష్ అంబానీ, ఇతర డైరెక్టర్లు తమ కంటే ఎక్కువ పొడిగింపు కోసం వాటాదారుల అనుమతి అవసరం. ప్రస్తుతం ఆమె శాశ్వతంగా బోర్డులో కొనసాగుతారు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!