Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aasman Teaser: దివంగత ‘రియల్ స్టార్’ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘ఆస్మాన్’ (Aasmaan) అఫీషియల్ టీజర్ నేడు (2026 సెప్టెంబర్ 16) గ్రాండ్‌గా విడుదలైంది. రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ‘ఆస్మాన్’ టీజర్‌ను ఆఫీషియల్ గా లాంచ్ చేశారు. ఈ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని కాంబోడియాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా అడవి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. టీజర్లో చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులు, హారర్ ట్విస్టులు సినిమాపై బజ్ పెంచుతుండగా, మేఘాంశ్ తన తండ్రిని గుర్తుకు తెచ్చేలా పవర్ఫుల్ మాస్ లుక్‌లో కనిపించి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు.
‘ఆస్మాన్’ టీజర్లో ఒక కుటుంబాన్ని ప్రధానంగా పరిచయం చేశారు. ఆ కుటుంబం కొన్ని మూఢనమ్మకాలను గట్టిగా నమ్ముతూ, దుష్ట శక్తులతో సంబంధం ఉన్నట్లు అనిపించే కొన్ని కలవరపరిచే పనులు చేస్తుంటుంది. పరిస్థితులు క్రమంగా ప్రమాదకరంగా మారుతున్న సమయంలో మేఘంశ్ పాత్ర రంగంలోకి దిగినట్లు టీజర్ చూపిస్తోంది. అసలు ఆ కుటుంబానికి ఎదురైన సమస్య ఏమిటి? మేఘంశ్ దానిని పరిష్కరించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారనే విషయాలను మాత్రం టీజర్లో పూర్తిగా రివీల్ చేయలేదు. టీజర్‌ను ఆసక్తికరమైన విజువల్స్, సస్పెన్స్‌తో కట్ చేశారు. కథను బయటపెట్టకుండా కేవలం కొన్ని సన్నివేశాలతోనే క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశారు. టీజర్ చూస్తుంటే కంటెట్ గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తోంది.
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
మేఘంశ్ శ్రీహరి ఇప్పటికే ‘రాజ్ దూత్’, ‘కోతి కొమ్మచ్చి’ సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ‘ఆస్మాన్’తో మరోసారి తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అరబిక్ భాషలో కూడా సినిమాను రిలీజ్ చేయనున్నారు. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘాంశ్ సరసన రాయంచ హీరోయిన్గా నటిస్తుండగా, రవివర్మ, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్. విహారి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం టీజర్ ద్వారా క్యూరియాసిటీ పెంచిన మేకర్స్ త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇక ‘ఆస్మాన్’లో దాగి ఉన్న అసలు మిస్టరీ ఏంటో తెలియాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే.
- Tags
- Aasman Teaser
- cinema
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!