Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ ప్రేక్షకులకు విలక్షణ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ పేరు పరిచయం అక్కర్లేదు. ‘ఆ నలుగురు’, ‘అందరి బంధువయా’ లాంటి అత్యంత సున్నితమైన, భావోద్వేగ భరితమైన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఏడిపించిన ఆయన.. ఇప్పుడు కుర్రాళ్లకు పిచ్చెక్కించే కంటెంట్‌తో ముస్తాబయ్యారు. ఒకప్పుడు మానవ సంబంధాల గురించి అద్భుతంగా చెప్పిన దర్శకుడు, ఇప్పుడు ‘ప్రేయసిని షేర్ చేసుకోవాలనుకునే ప్రియుడు, పెళ్లి పీటల మీద భర్తతో పాటు మరొకరు కావాలని కోరిన భార్య’ వంటి సెన్సేషనల్ పాయింట్స్ తో ఒక మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ ను రెడీ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమాకు చంద్ర సిద్ధార్థ్ పెట్టిన టైటిల్ మరో సంచలనం. “ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు” (ఉపశీర్షిక: ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా) అనేది ఈ సినిమా టైటిల్. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌గా ఇది రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హిట్ మెషీన్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా అత్యంత ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “ఇంత పెద్ద టైటిల్‌తో రావడం చాలా ఆసక్తికరంగా ఉంది. చంద్ర సిద్ధార్థ్ గారి దగ్గర నేను గతంలో స్క్రిప్ట్ విభాగంలో పని చేశాను. సెన్సిబుల్ సినిమాలు తీసే ఆయన ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతారు” అని ఆకాంక్షించారు.
Also Read
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
హర్ష హీరోగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా, రవివర్మ, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రలు పోషించారు. టీజర్ అయితే యూత్‌కు విపరీతంగా కనెక్ట్ అయ్యేలా ఉంది. హీరో ఒక ఇంటికి వెళ్లి ‘నీ రేడియో కావాలి’ అని అడిగితే, అక్కడున్న రేఖా నిరోషా.. ‘నేను వద్దా?’ అని అడగడం ఆసక్తిగా మారింది. అలాగే ఇనాయా సుల్తానాను చూసి “ఇంత అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఎలా వదులుకున్నారు?” అని అడిగితే.. దానికి ఆమె, “ఎప్పుడూ మీరే వదిలేయాలా? మేం వదలకూడదా?” అని చెప్పే డైలాగ్స్ సినిమా ఏ జానర్లో ఉండబోతోందో హింట్ ఇస్తున్నాయి.
దివంగత దర్శక రచయిత మదన్ రాసిన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న కనెక్షన్ నేపథ్యంగా.. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, మెమరీస్ వంటి ఆసక్తికర అంశాలతో ఈ థ్రిల్లర్ ను డిజైన్ చేశారు. వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది. ఈ బోల్డ్ అండ్ థ్రిల్లింగ్ మూవీ సెన్సిబుల్ డైరెక్టర్‌కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!