PM Modi: “నేను జీవించి ఉన్నంత వరకు అది సాధ్యం కాదు”.. రిజర్వేషన్లపై ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని అన్నారు. కలకత్తా హైకోర్టు 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికేట్లను క్యాన్సిల్ చేసిన చేసింది. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోడీ విరుచుకుపడ్డారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో వారు రాత్రికి రాత్రే ముస్లింలకు, చొరబాటుదారులకు ఓబీసీ సర్టిఫికేట్లు జారీ చేశారు. గత 10-12 ఏళ్లలో ముస్లింలకు జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు రద్దు చేసింది. కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సీఎం మమతా బెనర్జీ అంగీకరించడం లేదని, వారు ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇది ఇండియా కూటమి మనస్తత్వం’’ అని ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు.
Read Also: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సల్స్ మృతి..
Also Read
కాంగ్రెస్, టీఎంసీ, ఇతర ఇండియా కూటమికి చెందిన పార్టీలు వారి ఓటు బ్యాంకుకు మద్దతు ఇస్తున్నాయని, అయితే మోడీ జీవించి ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని మీకు భరోసా ఇస్తున్నానని మోడీ అన్నారు. ఇది రాజకీయ ప్రసంగం కాదని, అణగారిన వారి హక్కులకు తాను ఇచ్చే హామీ అని అన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు దేశం కన్నా వారి ఓటుబ్యాంకు ముఖ్యమని, ఈ వ్యక్తులు తమ ఓటు బ్యాంకు కోసం దేశాన్ని విభజించారని, వారు ఇండియాను విభజించి రెండు ముస్లిం దేశాలను సృష్టించారని అన్నారు.
2010 తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లను కలకత్తా హైకోర్టు బుధవారం రద్దు చేసింది. 1993 చట్టం ప్రకారం OBCల కొత్త జాబితాను సిద్ధం చేయాలని పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను కోర్టు ఆదేశించింది. దాదాపుగా 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లు రద్దయ్యాయి. 2010 తర్వాత ఓబీసీ కోటా కింద ఉద్యోగాల్లో ఉన్నవారు, వాటిని పొందే ప్రక్రియలో ఉన్న వారు కోటా నుంచి మినహాయింపబడరు. వారి ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. కలకత్తా హైకోర్టు తీర్పు తర్వాత, ఈ తీర్పును అంగీకరించబోమని సీఎం మమతా బెనర్జీ అన్నారు.
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!