Atrocious: చిన్నారి పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టి చంపిన తాంత్రికుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సాంకేతికంగా ఎంతగా ముందుకు వెళ్తున్నప్పటికీ గ్రామాల్లోని అనేకమంది ఇప్పటికీ సంప్రదాయ వైద్యంపై ఆధారపడుతున్నారు. దేశంలో దాదాపు 10 లక్షల మంది అల్లోపతి వైద్యాన్ని అభ్యసిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంచనా వేసింది. తాజాగా అభం శుభం తెలియని చిన్నారి ఈ వైద్యం పేరుతో బలయ్యాడు.. బులంద్ షహర్ జిల్లాలోని ధకర్ గ్రామంలో అనూజ్ అనే ఏడాది బాలుడు అనారోగ్యం బారినపడ్డాడు. దాంతో కుటుంబసభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు. బాలుడిని బాగుచేసే పేరుతో ఆ మంత్రగాడు అతడిని నేలకేసి కొట్టాడు. అంతేగాక, బాలుడి నోట్లోని పళ్లను విరగ్గొట్టాడు. దాంతో ఆ పసిబిడ్డ అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు.
Read Also: Shocking: తన అంత్యక్రియలను తానే చేసుకున్న వృద్ధుడు
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ఇది గమనించి కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. దాంతో బాధిత కుటుంబం బాలుడి భౌతికకాయాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, బులంద్‌షహర్ జిల్లాలో ఆరోగ్య కేంద్రాలు సరిపడా లేవని, ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కూడా డాక్టర్లు అందుబాటులో ఉండరని, ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లాలంటే పేదలకు మోయలేని ఆర్థిక భారమని.. అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మూడు నెలల బాలిక అనారోగ్యాన్ని నయం చేసే పేరుతో ఓ మంత్రగాడు ఇనుప చువ్వను కాల్చి 51 సార్లు కడుపుపై గుచ్చి చంపాడు.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!