Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందువుల్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ చట్టాలను తీసుకువచ్చిందని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిందూ సమాజాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చిందని, చట్టాలను తీసుకువచ్చిందని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించవచ్చని సూచించారు.