Nikhat Zareen: భారత బాక్సింగ్ స్టార్, తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ మరోసారి అద్భుత ప్రతిభను కనపరిచింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో నిఖత్ 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. నవంబర్ 20న జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై నిఖత్ 5–0 తేడాతో వార్ వన్ సైడ్ లా విజయం సాధించింది. ఈ విజయంతో భారత మహిళల స్వర్ణాల సంఖ్య ఐదుకు చేరింది. నిఖత్‌కు ముందు 48 కిలోల విభాగంలో మినాక్షి హూడా, 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్, 70 కిలోల విభాగంలో అరుగంధతి, 80+ విభాగంలో నూపుర్ శియోరన్ లు కూడా స్వర్ణాలు సాధించారు.
Priyanka Mohan ; భారీ ప్రాజెక్ట్‌తో.. కన్నడకు రీఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్
మాజీ ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్‌కి ఈ స్వర్ణం ప్రత్యేకమైనది. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె సాధించిన తొలి అంతర్జాతీయ పతకమిది. ఈ టోర్నీలో నిఖత్ వెయిట్ కేటగిరీలో కేవలం ఐదుగురు బాక్సర్లు మాత్రమే పాల్గొనడంతో ఆమె నేరుగా సెమీఫైనల్‌లో ప్రవేశించింది. ఆమె ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జెనీవా గుల్‌సెవర్‌ను 5–0తో చిత్తు చేసి ఫైనల్‌కి చేరింది. గత ఏడాది భుజం గాయంతో రింగుకు దూరమైన నిఖత్ ఈ టోర్నీతో తిరిగి బరిలోకి వచ్చి తన సత్తాను చాటి చెప్పింది. 2024 ఫిబ్రవరిలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో గెలిచిన తర్వాత నిఖత్ సాధించిన తొలి పతకం ఇదే. ఇదిలా ఉండగా.. మరో భారత బాక్సర్ నూపుర్ కూడా ఈ టోర్నీలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఒల్టినోయ్ సోటింబోయేవాపై 5–0 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి నుంచి బయట పడి తాజాగా స్వర్ణం సాధించింది.
నేటి నుంచే ఆన్‌లైన్‌లో Meta Ray-Ban Smart Glasses.. భారీ తగ్గింపు..!!
నిఖత్ జరీన్ గెలిచిన స్వర్ణంపై తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న నిఖత్ 5–0 తేడాతో ప్రదర్శన ఇవ్వడం ఆమె అంకితభావానికి నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిన నిఖత్ జరీన్‌కు హృదయపూర్వక అభినందనలని తెలిపారు. క్రీడల్లో ఆమె సాధించిన ప్రమాణాలు ఇతర క్రీడాకారులకు ఆదర్శం అని అన్నారు. నిఖత్ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా నిఖత్ జరీన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Hon'ble Chief Minister Shri @revanth_anumula extended his heartfelt congratulations to Telangana boxer @nikhat_zareen on securing the gold medal in the World Boxing Cup finals.
Commending her exceptional performance in the 51 kg category at the event being held in Greater… pic.twitter.com/nMBIxmGtYY
— Telangana CMO (@TelanganaCMO) November 20, 2025