నేటి నుంచే ఆన్‌లైన్‌లో Meta Ray-Ban Smart Glasses.. భారీ తగ్గింపు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta Ray-Ban Smart Glasses: మెటా రే-బాన్ జెన్ 1 స్మార్ట్ గ్లాసెస్ నవంబర్ 21 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం మే నెలలో కంపెనీ ఈ గ్లాసులను భారతదేశంలో విడుదల చేసింది. ఎస్సిలోర్‌లక్సోటికాతో భాగస్వామ్యంతో మెటా ఈ గ్లాసులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. అయితే.. ఈ స్మార్ట్ గ్లాసెస్‌పై కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్‌లో మెటా రే-బాన్ జెన్ 1 స్మార్ట్ గ్లాసెస్ ప్రారంభ ధర రూ.29,900. ఈ స్మార్ట్ గ్లాసెస్ Rayban.com, ఇతర ప్రముఖ ఆప్టికల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఇప్పుడు వాటిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిలయన్స్ డిజిటల్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను ₹22,920 ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. వీటిపై 20% బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 1 వరకు చెల్లుబాటు అవుతుంది.
READ MORE: Egg Price Hike: కొండెక్కిన కోడి గుడ్డు ధర.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బద్దలు..
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ప్రత్యేకతలు ఏంటి..?
ఈ గ్లాసెస్ వినియోగదారులకు హ్యాండ్స్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. ఇవి మెటా AIతో లింక్ అయి ఉంటాయి. దీంతో ప్రయాణ సమయంలో వీటిని ఏవైనా ప్రశ్నలు అడిగి రియల్-టైమ్ సమాధానాలను పొందొచ్చు. ఇవి ట్రాన్స్‌లేట్ చేయడం, ఇతర AI-ఆధారిత ఫీచర్లను అందించడం వంటివి కూడా చేయగలదు. ఇవి వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లతో ఎంగేజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మ్యూజిక్ వినడానికి కూడా వీలు కల్పిస్తాయి. ఈ రే-బాన్ మెటా స్మార్ట్‌గ్లాసెస్ రెండు సంవత్సరాల క్రితం (సెప్టెంబర్ 2023) ప్రపంచ మార్కెట్లో లాంఛ్ అయ్యాయి. కంపెనీ నుంచి వచ్చిన మొట్ట మొదటి స్మార్ట్‌గ్లాసెస్ పేరు ‘రే-బాన్ స్టోరీస్’. వీటిని మెటా సెప్టెంబర్ 2021లో అమెరికాలో ప్రవేశపెట్టింది.
READ MORE: Unique Offer : రూపాయి నోట్ తెచ్చుకో.. హాఫ్ కేజీ చికెన్ తీసుకో…
ఈ ఏడాది మేలో భారతదేశంలో విడుదల చేసింది. దీంతో ఆసియాలో మెటా రే-బాన్ మెటా గ్లాసెస్‌ను ప్రారంభించిన మొదటి మార్కెట్‌గా భారతదేశం మారింది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను భారత్‌లో విడుదల చేయడం ద్వారా మెటా దేశీయ మార్కెట్లో క్వెస్ట్ VR హెడ్‌సెట్స్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మెటా క్వెస్ట్ ఉత్పత్తులు అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో థర్డ్-పార్టీ సెల్లర్స్ ద్వారా భారత్‌లో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో మెటా స్మార్ట్ గ్లాసెస్ అనేక స్టైల్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?