కన్నడలో మళ్లీ రీఎంట్రీ ఇస్తూ ప్రియాంక మోహన్ ఒక భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా వస్తున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ అనే పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్‌గా ఫైనల్ అయ్యింది. ‘సప్తసాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకను హీరోయిన్‌గా తీసుకున్నట్లు ఆమె పుట్టినరోజు సందర్భంగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొదట్లో ‘ఓంధ్ కథే హెల్లా’ సినిమాతో కన్నడలోనే ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక, మధ్యలో కొంతకాలంగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో బిజీగా ఉండి మళ్లీ చాలాకాలం తర్వాత కన్నడలో నటించడం ప్రత్యేకం.
Also Read :Bhagyashree : అలాంటి రోల్స్ చేయాలి..అదే నా డ్రీం
ఈ సినిమాను 1970ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ కాలం నాటి కథ, వాతావరణం, రియలిస్టిక్ ఎమోషన్స్‌గా ఈ సినిమాకి స్పెషల్ లుక్ ఇవ్వనున్నాయి. శివరాజ్‌కుమార్‌తో పాటు నటుడు డాలీ ధనుంజయ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ‘ఓజీ’తో మంచి క్రేజ్ సంపాదించిన ప్రియాంక, ఈలాంటి స్ట్రాంగ్ స్క్రిప్ట్‌తో కన్నడలో తిరిగి అడుగుపెట్టడం, ఆమె కెరీర్‌కు మరో పాజిటివ్ మార్పు తీసుకువస్తుందని అభిమానులు భావిస్తున్నారు.