టీ20లలో న్యూజిలాండ్‌పై ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్.. వన్డేలలో కూడా అదే అలవాటుగా మారింది. తాజాగా కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో పాక్ 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ కేవలం 22 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను పట్టుకున్న క్యాచ్ చూసి అభిమానులు, సహచర ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
NZ vs Pak: న్యూజిలాండ్‌లో జరుగుతున్న పాకిస్తాన్ టూర్‌లో భాగంగా, నేడు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మూడవ T20I మ్యాచ్ జరిగింది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ 2-0తో వెనుకబడి ఉండగా, ఈ మ్యాచ్‌లో వారు సిరీస్‌ను సజీవంగా నిలిపేందుకు ప్రయత్నించారు. అయితే, న్యూజిలాండ్ ఆటగాళ్లు గత రెండు మ్యాచ్‌లలోనూ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, ఈ మ్యాచ్‌లో కూడా వారి ఆధిపత్యం చూపించినప్పటికీ హసన్ నవాజ్ తుఫాను సెంచరీతో ఓడిపోవాల్సి వచ్చింది.…
Pak Vs NZ: న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ నేడు డునెడిన్‌లోని యూనివర్సిటీ ఓవల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ లు ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. టిమ్ సీఫర్ట్ 22 బంతుల్లో 45 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో టిమ్ సీఫర్ట్‌ను…
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. రెండు జట్ల మధ్య 5 T20లు, 3 ODIలు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టును ఇప్పటికే ప్రకటించారు. షాదాబ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 జట్టులోకి ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి రావడాన్ని…
Pakistan Opener Saim Ayub Six Video Goes Viral: పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ వీరవిహారం చేశాడు. 8 బంతుల్లో ఏకంగా 5 బౌండరీలతో 27 రన్స్ బాదాడు. ఇందులో మూడు సిక్సులు ఉండగా.. రెండు ఫోర్లు ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో సయీమ్ ఆయుబ్ విరుచుకుపడ్డాడు. అయితే ఫైన్ లెగ్‌లో బాదిన ఓ సిక్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాట్…
Shaheen Shah Afridi Takes Wicket as Pakistan Captain: ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది పాకిస్తాన్ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత బాబర్ ఆజామ్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. దాంతో టీ20లో జట్టు పగ్గాలు షాహీన్ అందుకున్నాడు. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో…
Mitchell Santner Test Positive for Covid 19: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం సాంట్నర్ బాగానే ఉన్నాడని, సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు న్యూజిలాండ్ బోర్డు తెలిపింది. సాంట్నర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, రెండో టీ20 జరిగే హామిల్టన్‌కు ఒంటరిగా వెళతాడు అని పేర్కొంది. కరోనా పాజిటివ్ కారణంగా పాకిస్తాన్‌తో ఈరోజు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగే తొలి…
Kane Williamson becomes leading run-getter of New Zealand in 48 year old World Cup history: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడమే కాకూండా.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగుల మైలురాయిని కేన్ చేరుకున్నాడు. దాంతో న్యూజిలాండ్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 24 ఇన్నింగ్స్‌లో కేన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. పాకిస్తాన్ పేసర్…
Kane Williamson back in Zealand vs Pakistan Match: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు కీలక పోరు ఆరంభం అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సెమీస్ బెర్త్ ఆశిస్తున్న న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. ఉసామా మీర్ స్థానంలో హసన్ అలీ ఆడుతున్నాడు. మరోవైపు కివీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.…