CM Relief Fund: సీఎంఆర్ఎఫ్లో కొత్త రికార్డు.. ఏడాదిలోనే రూ.830 కోట్ల సాయం
- సీఎంఆర్ఎఫ్లో కొత్త రికార్డు
- ఏడాదిలోనే రూ.830 కోట్ల సాయం
- 1.66 లక్షల కుటుంబాలను ఆదుకున్న ప్రజా ప్రభుత్వం
- పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు పునర్జన్మ
- గతంలో సీఎంఆర్ఎఫ్లో జరిగిన అవకతవకలకు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Relief Fund: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం… అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు రూ.830 కోట్లు సీఎంఆర్ఎఫ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో లబ్ధి పొందాయి. 2018 నుంచి 2023 వరకు అయిదేండ్లలో అప్పటి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2400 కోట్ల సాయం అందించింది. అప్పటి ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.480 కోట్లు ఖర్చు పెడితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క ఏడాదిలోనే రూ.830 కోట్లు సాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రజలకు ఆపదలు వచ్చినా, విపత్తులు సంభవించినా ఆదుకునేందుకు నేనున్నానంటూ.. అభయ హస్తం అందించారు.
Read Also: Telangana: ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికి పెద్ద పీట.. నాణ్యమైన విద్యా బోధనకు చర్యలు
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
ఈ ఏడాది ఇచ్చిన రూ.810 కోట్లలో రూ.590 కోట్లు సీఎంఆర్ఎప్ ద్వారా సాయం అందించటం గమనార్హం. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం అవసరమైతే ప్రజా ప్రతినిధుల సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ సాయం అందిస్తుంది. కొన్ని వ్యాధులకు జిల్లా స్థాయిలో అవసరమైన వైద్య చికిత్స సదుపాయం అందుబాటులో లేక హైదరాబాద్ లోని పెద్ద ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో ముందుగానే సీఎం సహాయ నిధిని ఆశ్రయిస్తారు. అటువంటి సందర్భాల్లో నిమ్స్ తో పాటు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి, నిలోఫర్, ఈఎన్ టీ, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్సలకు అయ్యే అంచనా ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సీఎం సహాయ నిధి నుంచి సంబంధిత ఆసుపత్రికి ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీ చేస్తుంది. ఈ ఎల్వోసీల జారీలోనూ సీఎం తన ఉదారతను చాటుకున్నారు. ఈ ఏడాదిలోనే 13 వేల మందికి ఎల్ వోసీ లు జారీ చేసింది. సుమారు రూ. 240 కోట్ల ఎల్వోసీలు మంజూరు చేశారు. ఇందులో అత్యధికంగా చిన్న పిల్లలకు అవసరమయ్యే ఆపరేషన్లు, చికిత్సలకు కేటాయించారు.
Read Also: BJP Chargesheet: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్
ప్రాణాపాయంలో ఎవరున్నా సరే.. వైద్య చికిత్స అత్యవసరమని గుర్తించిన ప్రజా ప్రభుత్వం ఎల్వోసీల జారీని వేగవంతం చేసింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఎల్వోసీ ఇచ్చే ఏర్పాట్లు చేసింది. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవద్దని, ఆదివారంతో పాటు సెలవు దినాల్లో కూడా ఎల్వోసీలు క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించటం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులకు కూడా అవినీతి చీడ పట్టుకుంది. పేదల పేరిట మెడికల్ బిల్లులు సృష్టించి నిధులను దిగమింగే దందా వెలుగులోకి వచ్చింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్ఎఫ్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసింది. పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను కూడా ఆన్లైన్ లోకి తెచ్చింది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తుదారులే తమ సీఎంఆర్ఎఫ్ సాయం ఏ దశలో ఉందో.. ఎప్పటికప్పుడు స్టేటస్‌ను తెలుసుకునేలా ఆన్లైన్ వ్యవస్థను రూపొందించారు. గతంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో పని చేసిన సిబ్బంది సీఎంఆర్ఎఫ్ చెక్కులు తమ ఖాతాల్లో వేసుకున్నారు. అటువంటి లొసుగులకు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్దిదారుల పేర్లతో పాటు వారి బ్యాంక్ ఖాతా నంబర్‌ను రేవంత్ సర్కారు ముద్రిస్తోంది. హాస్పిటల్స్ వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేసి, దొంగ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేయడాన్ని నిరోధించింది. నిజమైన అర్హులకు మాత్రమే సీఎం సహాయ నిధి అందే ఏర్పాట్లు చేసింది.
Read Also: Samantha: సమంతను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
ఆ పిల్లలకు పునర్జన్మ
పుట్టుకతోనే ఈఎన్టీ(మూగ, చెవుడు) సమస్యలతో పుట్టే పిల్లలకు 6 ఏండ్ల లోపల శస్త్రచికిత్సలు చేయించాల్సి ఉంటుంది. అవసరమైన వినికిడి పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. లేకుంటే వారు జీవితాంతం మూగ వారిగా ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ ఆపరేషన్ల ఖరీదు లక్షల్లో ఉండడంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆపరేషన్లు చేయించుకోలేకపోతున్నారు. అలాంటి పిల్లలు జీవితాంతం చెవులు వినపడక, మాటలు రాని అభాగ్యులుగా ఉంటున్నారని తొలి సమీక్ష సమావేశాల్లోనే వైద్యారోగ్య శాఖ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన ముఖ్యమంత్రి తెలంగాణలో భవిష్యత్తు తరాల్లో చెవిటి, మూగ పిల్లలు ఉండకూడదని, అటువంటి పరిస్థతి పునరావృతం కాకుండా ఎంత ఖర్చయినా ప్రభుత్వమే అలాంటి పిల్లలకు ఛికిత్సలు చేయాలని ఆదేశించారు. ఎల్వోసీలు ఇచ్చి అటువంటి పిల్లలను ఆదుకోవాలని ఆదేశించారు.
ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 87 మంది పిల్లలకు ఎల్వోసీ ఇచ్చి ఆపరేషన్లు ఇచ్చారు. ఇది తమ పిల్లలకు రేవంతన్న ఇచ్చిన పునర్జన్మ అని పిల్లల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.