ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం... అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు రూ.830 కోట్లు సీఎంఆర్ఎఫ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్‌తో లబ్ధి పొందాయి.