Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు
- 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం
- త్వరలోనే పనుల ప్రారంభానికి ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhavaleswaram Barrage Renovation: గోదావరి నదిపై బ్రిటిష్ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఆధునికీకరణ చేపట్టేందుకు సిద్ధమైంది. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ బ్యారేజీకి పూర్తి స్థాయి పునరుద్ధరణ పనులు జరగనున్నాయి. గోదావరి డెల్టా ప్రాంతానికి జీవనాడిగా నిలిచిన ఈ బ్యారేజీ భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ధవళేశ్వరం బ్యారేజీలో చివరిసారిగా 1980లో ప్రధాన మార్పులు చేపట్టారు. ఆ తర్వాత కాలక్రమేణా బ్యారేజీలోని పలు భాగాలు దెబ్బతినడంతో పాటు గేట్లపై తుప్పు ప్రభావం కూడా పెరిగింది. డ్యాం భద్రతా నిపుణులు పలుమార్లు బ్యారేజీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నివేదికలు సమర్పించినప్పటికీ.. గతంలో పునరుద్ధరణ పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించగా.. బెకం సంస్థ రూ.124.34 కోట్లకు దక్కించుకుంది. పనులు ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
ఆధునికీకరణలో భాగంగా ప్రస్తుతం తుప్పు పట్టి బలహీనంగా మారిన 117 గేట్లను తొలగించి.. వాటి స్థానంలో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో బ్యారేజీ నీటి నిల్వ, విడుదల వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పనులు పూర్తయిన అనంతరం ధవళేశ్వరం బ్యారేజీ భద్రత గణనీయంగా మెరుగుపడటంతో పాటు, గోదావరి డెల్టా ప్రాంతంలోని లక్షలాది ఎకరాలకు సాగునీటి సరఫరా మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని అధికారులు భావిస్తున్నారు. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణతో గోదావరి డెల్టా వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి లభించనుండగా.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటి వనరుల నిర్వహణలో కూడా ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?