Modi-Israel: ఇజ్రాయెల్ చేరుకున్న మోడీ.. ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
- ఇజ్రాయెల్ చేరుకున్న మోడీ
- ఘనస్వాగతం.. 2 రోజుల పాటు పర్యటన
- ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగం చేయనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయింది. విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన కోసం మోడీ ఇజ్రాయెల్ వెళ్లారు. పర్యటనలో భాగంగా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. అంతేకాకుండా సరికొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మేరకు 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించిన మొదటి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. అనంతరం రెండోసారి బుధవారం పర్యటిస్తున్నారు. నెతన్యాహుతో భేటీ తర్వాత రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలపై ఒప్పందాలు జరగనున్నాయి. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్డోగ్‌ను కూడా కలవనున్నారు.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్

ఇదిలా ఉంటే మోడీ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థ ది జెరూషలేం పోస్ట్‌కు చెందిన వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రధాని మోడీపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. హిందీలో నమస్తే.. హిబ్రూలో షాలోమ్ అంటూ హడ్‌లైన్ పెట్టింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కథనంలో మోడీ ఫొటో ప్రధానంగా కనిపించింది. మోడీ చేతులు ఊపుతున్నట్లుగా ఉన్న ఫొటో ప్రచురితం చేశారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాల ఆధారంగా కథనాన్ని రాసింది. ‘‘స్వాగతం మోడీ’’ అని.. అలాగే మరొకటి ‘జెరూషలేంతో భారత్ సంబంధాలు’’ అనే కథనాలు ప్రింట్ చేసింది. అంతేకాకుండా ఇజ్రాయెల్‌కు భారత రాయబారి జేపీ.సింగ్‌కు సంబంధించిన ఇంటర్వ్యూను కూడా వేసింది.
#WATCH | Visuals from the city of Jerusalem, Israel, where Prime Minister Narendra Modi will arrive shortly for a state visit.
At the invitation of Israeli Prime Minister Benjamin Netanyahu, PM Modi is undertaking a State Visit to Israel from 25-26 February 2026. pic.twitter.com/mXB9i47uXJ
— ANI (@ANI) February 25, 2026

తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!