Telangana: నేడు రాష్ట్రానికి ఎన్డీఎస్ఏ కమిటీ.. మేడిగడ్డలో పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) నిపుణుల కమిటీ నేడు(బుధవారం) రాష్ట్రానికి రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురితో ప్రభుత్వం కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ హైదరాబాద్‌కు చేరుకున్నాక బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర అధికారులతో ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశం కానుంది.
Read Also: MP Laxman: మోడీని విమర్శించే వారంతా వారి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు..
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
7, 8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనుంది. మళ్లీ 9వ తేదీన హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. ఆ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీల ప్లానింగ్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం) అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని సర్కారును కోరింది. మేడిగడ్డ కుంగుబాటుపై కమిటీ విచారణ చేపట్టనుంది.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!