కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) నిపుణుల కమిటీ నేడు(బుధవారం) రాష్ట్రానికి రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్‌ఏకు లేఖ రాశారు.