కోలివుడ్ స్టార్ హీరోయిన్ నయన తార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ నయనతార వారి పిల్లలను చూపిస్తూ తొలిపోస్ట్ చేసింది.ఇక దానికి లక్షల లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి.ప్రస్తుతం నయనతారకు ఇన్‌స్టాలో 78లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు..
అయితే ఒక పోస్ట్ చేసి డిలీట్ చెయ్యడమే కాదు.. తన భర్తను అన్ ఫాలో చేసింది.. విఘ్నేశ్ శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.సాంకేతికలోపం వల్ల విఘ్నేశ్ పేరు కనిపించడం లేదంతే’ అని ఒకరు, విడిపోతున్నారా అని మరొకరు కామెంట్ చేశారు.. ఇటీవల సెలబ్రిటీలు విడిపోయేముందు ఒకర్నొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ నయన్ అన్ ఫాలో చేసినా, విగ్నేష్ ఇంకా ఫాలో చేస్తున్నాడు.
సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారా? లేకా అనుకోకుండా అన్ ఫాలో చేసిందా? లేదా ఇంకేదైన సందేహం ఉందా అని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. వాలెంటైన్స్ డే సందర్బంగా ఇద్దరు పోస్టులు పెట్టారు.. అయితే ఈ మధ్య తన భర్త సినిమా చెయ్యనని కూడా చెప్పేసింది.. ఈరోజు వార్తల పై నయన్ స్పందించి క్లారిటి ఇవ్వాల్సి ఉంది..