లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఇక ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఇటీవలే ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు వరుసగా పోస్టులను పెడుతూ వస్తుంది.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది..
ఆ వీడియోలో నయన్ తో పాటు మరో ఇద్దరు కూడా కనిపించారు. వారంతా అర్ధరాత్రి రోడ్డుపై ఐస్ క్రీమ్ తింటూ కనిపించారు.. వారితో నయన్ చాలా సరదాగా కనిపిస్తుంది.. వాళ్లు నయన్ స్నేహితులులాగా ఉన్నారు.. ఐస్ క్రీమ్ తింటూ చాలా సరదాగా ఉన్నారు. ఆ ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగానే నయనతార బ్యానర్ ఒకటి కనిపించింది.. ఆ ఇద్దరు నయన్ తో ఫన్నీగా ఓ వీడియోను చేశారు.. ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ వీడియోను చూసిన చాలా మంది అంత పెద్ద స్టార్ అయిన ఇలా సింపుల్ గా రోడ్డు పక్కన తినడం గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. తెలుగులో పెద్దగా సినిమాలను అనౌన్స్ చేసినట్లు లేదు.. తమిళ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్ లను ప్రమోట్ చేస్తుంది..
— Nayanthara✨ (@NayantharaU) April 4, 2024