న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాలలో “జెర్సీ”మూవీ ఒకటి .ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతం తిన్ననూరి తెరకెక్కించారు… సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన జెర్సీ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ,ఈ చిత్రంలో నాని అద్భుతంగా నటించారు .నాని చేసిన బెస్ట్ సినిమాలలో ఒకటిగా జెర్సీ మూవీ నిలిచిపోతుంది .ఇదిలా ఉంటే జెర్సీ మూవీ రిలీజ్ అయి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా జెర్సీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.దీనితో నాని ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ గా వున్నారు .అయితే ఈ రీ రిలీజ్ సందర్భంగా నాని ఫ్యాన్స్ కు మరో సర్ఫ్రైజ్ ప్లాన్ చేసారు .ఈ సినిమాను నాని ఫ్యాన్స్ తో కలిసి చూసేందుకు సిద్ధం అయ్యారు .నాని తో పాటు జెర్సీ మూవీ దర్శక నిర్మాతలు గౌతం తిన్ననూరి మరియు నాగ వంశీ ఈ స్పెషల్ షో కి హాజరవనున్నారు.
సుదర్శన్ 35 ఎం.ఎం లో జెర్సీ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఏప్రిల్ 20 ఈవెనింగ్ ఆరు గంటల షోకి నాని, గౌతం తిన్ననూరి మరియు నాగ వంశీ రాబోతున్నారు. ప్రేక్షకులతో పాటు వారు కూడా సినిమాను చూడబోతున్నారు. ఈ విషయం తెలిసి నాని ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ గా వున్నారు .తమ అభిమాన హీరోతో జెర్సీ సినిమాను చూడాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చుస్తుస్తున్నారు.జెర్సీ సినిమాలో నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను గౌతం తిన్ననూరి హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. జెర్సీ సినిమా తర్వాత మళ్లీ గౌతం తో నాని పనిచేయాలని చూస్తున్నారు .త్త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది .ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ షూటింగ్ లో బిజీ గా వున్నారు.అలాగే దర్శకుడు గౌతమ్ తిన్నురి కూడా రౌడీ హీరోతో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీని ప్లాన్ చేసారు .ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో వుంది .