నేషనల్ మెడికల్ కమిషన్(NMC) చట్టబద్ధమైన నిబంధనలు, కనీస ప్రమాణాలను పాటించడంలో విఫలమైన వైద్య కళాశాలల విషయంలో కఠినమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. నిబంధనలు పాటించని సందర్భాల్లో ఒక్కో ఉల్లంఘనకు రూ. 1 కోటి చొప్పున జరిమానా విధించనున్నట్లు జాతీయ వైద్య మండలి తెలిపింది. ఇవేకాక వైద్య సంస్థలు ఏడాది చివరిలో సమర్పించే రికార్డ్స్, మూల్యాంకన విధానాలు, నిబంధనలకు సంబంధించి ప్రొఫెసర్స్, డీన్, డైరెక్టర్, ఫ్యాకల్టీ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలితే ఆ వైద్య సంస్థలకు రూ.5 లక్షల జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనలు అధికారికంగా ‘మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్, 2023’ (MSMER-2023) పేరుతో విడుద చేయబడ్డాయి.
Also Read: Today Gold Price: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
MSMER-2023 నిబంధనల ముఖ్య ఉద్దేశం వైద్య విద్య ప్రమాణాలను సమర్థించడం అని పేర్కొన్న ఎన్ఎంసీ.. మధ్యవర్తుల ద్వారా కమిషన్‌పై ప్రభావం చూపడానికి ప్రయత్నించే మెడికల్ కాలేజీల నుండి వచ్చే అన్ని దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తామని హెచ్చరించింది. దీని ప్రకారం ప్రతి మెడికల్ కాలేజ్ యాన్యువల్ రిపోర్ట్ ను సమర్పించడం తప్పనిసరి. దీనిలో నివేదిక అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (UGMEB) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (PGMEB), అలాగే NMC ద్వారా నిర్దేశించబడిన నియమాల ద్వారా ఏర్పాటు చేయబడిన కనీస ప్రామాణిక నిబంధనల (MSRs)కు కట్టుబడి ఉండాలి. ద్యార్థులు, వారికి సంఖ్యకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బంది, వైద్యులు, వసతులు, అన్ని రకాల వ్యాధుల చికిత్సపై అవగాహన కల్పించడానికి సరిపడా రోగులు, రోగ నిర్ధారణ సౌకర్యాలు ఇలా ప్రతి ఒక్కదాని గురించి రిపోర్టలో పేర్కొనాలి. వీటిలో ఏదైనా ప్రమాణాలకు తగ్గట్టు లేకపోతే కచ్ఛితంగా ఫైన్ విధిస్తారు. ఇక తదుపరి సంవత్సరం ప్రవేశాలకు అనుమతి లభించాలంటే కూడా జాతీయ వైద్య మండలి సూచించిన అన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కొత్త కోర్సులు, వైద్య సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ)ని కూడా ఎన్ఎంసీ ఏర్పాటు చేసింది.