నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ర్యాగింగ్ ఘటనపై పై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మీడియాలో వరస కథనాల ద్వారానే ర్యాగింగ్ విషయం తెలిసిందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ లేఖలో పేర్కొంది. అసలు కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా లేదా అని ప్రశ్నించింది.
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ దృష్టి పెట్టింది. ర్యాగింగ్ పై విచారణకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ఆదేశించింది. యాంటీ ర్యాగింగ్ కమిటీ చేత విచారణ జరిపించాలని ఎన్ ఎం సి ఆదేశించింది.
Telangana Medical Colleges: ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావించింది. తాజాగా 4 మెడికల్ కాలేజీలకు అనుమతి రావడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరింది.
నేషనల్ మెడికల్ కమిషన్(NMC) చట్టబద్ధమైన నిబంధనలు, కనీస ప్రమాణాలను పాటించడంలో విఫలమైన వైద్య కళాశాలల విషయంలో కఠినమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. నిబంధనలు పాటించని సందర్భాల్లో ఒక్కో ఉల్లంఘనకు రూ. 1 కోటి చొప్పున జరిమానా విధించనున్నట్లు జాతీయ వైద్య మండలి తెలిపింది. ఇవేకాక వైద్య సంస్థలు ఏడాది చివరిలో సమర్పించే రికార్డ్స్, మూల్యాంకన విధానాలు, నిబంధనలకు సంబంధించి ప్రొఫెసర్స్, డీన్, డైరెక్టర్, ఫ్యాకల్టీ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలితే ఆ వైద్య సంస్థలకు రూ.5 లక్షల…