Nara Bhuvaneshwari: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ రోజుల ములాకత్‌లో చంద్రబాబును కలిశారు నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. అయితే, చంద్రబాబును కలిసిన తర్వాత సెంట్రల్ జైలు దగ్గర అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేయగా.. ఆ తర్వాత నారా భువనేశ్వరి ఓ వీడియో విడుదల చేశారు.. ఆ వీడియోలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు భువనేశ్వరి.. టీడీపీ అంటే ఒక కుటుంబం.. కార్యకర్తలు మా బిడ్డలుగా అభివర్ణించారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు.. నిరసనల్లో మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు.
Read Also: Bhatti Vikramarka: అధికారంలోకి వచ్చి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు..
చంద్రబాబు స్ట్రాంగ్ పర్సన్.. ఆయన్ను మానసిక క్షోభకు గురి చేయలేరు అని కౌంటర్ ఇచ్చారు భువనేశ్వరి.. పార్టీ జెండా రెపరెపలాడాలని వారి జీవితాలనే ఫణంగా పెట్టారు.. మహిళలన్న సంగతి కూడా మర్చిపోయి పోలీసులు ఇష్టానుసారంగా లాగిపడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేటి పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనమన్న ఆమె.. టీడీపీ కార్యకర్తలైన మా బిడ్డలు.. పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లని, వాళ్లే లేకుంటే పార్టీ లేదన్నారు. పోలీసులు ఏం చేసినా మా బిడ్డలు బెదరరు.. టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరం అన్నారు. అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. చిల్లర పనులతో చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరని స్పష్టం చేశారు.
Read Also: Sneha Nambiar: శరత్ బాబు నా భర్త కాదు.. నటి సంచలన వ్యాఖ్యలు
తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి.. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు భోజనం చేసేందుకు చిన్నపాటి సౌకర్యం కూడా కల్పించలేదు.. అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాత మాత్రమే టేబుల్ ఏర్పాటు చేశారని విమర్శించారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఇలాంటి చిల్లర ఆలోచనలతో చంద్రబాబును ఎవరూ మానసిక క్షోభకు గురిచేయలేరన్నారు. చంద్రబాబు ధైర్యంగా, ఆత్మ స్థైర్యంతో ఉన్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు నారా భువనేశ్వరి.