KL Rahul: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన కార్ల కలెక్షన్‌లోకి మరో లగ్జరీ వాహనాన్ని చేర్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో రాహుల్ తన కొత్త MG M9 ఎలక్ట్రిక్ ఎంవీపీ (EV MPV) కారును కొన్నట్లు కనిపించారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ MG M9 మోడల్‌ను కొనుగోలు చేసిన తొలి భారత క్రికెటర్ రాహుల్ అవ్వడం. JSW MG మోటార్ ఇండియా ఇటీవలే తమ ‘MG Select’ కింద ఈ ఫీచర్ రిచ్ MPVని భారత మార్కెట్లో విడుదల చేసింది. మంచి ఇంటీరియర్ స్పేస్, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో ఈ ఎలక్ట్రిక్ వాహనం సింగిల్ వెరియంట్‌లో మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
VC Sajjanar: వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా..? సజ్జనార్ మరో సంచలన ట్వీట్..!
ఇకపోతే ఈ MG M9 ధర రూ.73.75 లక్షలు (ఆన్-రోడ్) గా ఉంది. ఇది ఒక్క వెరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. MG M9 మెటల్ బ్లాక్, పర్ల్ లస్టర్ వైట్ (బ్లాక్ రూఫ్‌తో), కాంక్రీట్ గ్రే (బ్లాక్ రూఫ్‌తో) వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కేఎల్ రాహుల్ మెటల్ బ్లాక్ షేడ్ కారును ఎంచుకున్నారు. ఈ MG M9 లో లగ్జరీ, టెక్నాలజీ కలయిక కనిపిస్తుంది. ముఖ్యంగా రెండో వరుస సీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో ఇండిపెండెంట్ ఓటోమాన్ సీట్లు ఉంటాయి. వీటిలో మసాజ్, వెంటిలేటెడ్, హీటెడ్ ఫంక్షన్లు, అలాగే రియర్ సీట్ ఎంటర్టైన్‌మెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉన్నాయి.
13 Years Boy: గంటల తరబడి మొబైల్ గేమ్స్ ఆడిన బాలుడు.. చివరికి ఏమైందంటే?
అలాగే ముందు భాగంలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లు, రెజెన్ బ్రేకింగ్ మోడ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS with EBD, అలాగే లెవల్-2 ADAS టెక్నాలజీ కూడా ఇవ్వబడింది. MG M9 లో 90kWh NMC బ్యాటరీ అమర్చబడింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 548 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ మోటార్ 243 bhp పవర్, 350 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
KL Rahul's new car…😍🔥#KLRahul pic.twitter.com/4637JuAkDh
— Naveen Kumar Pambi (@pambinaveen) October 15, 2025