టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఎప్పుడూ తన సూటి మాటలతో, ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన తన X (ట్విట్టర్) అకౌంట్‌లో, “అది పీకుతా, ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు” అంటూ రాశారు.
Also Read : KGF 3: ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా..? ప్రశాంత్ నీల్ పోస్టు వైరల్
ఈ వ్యాఖ్యతో నెటిజన్లలో చర్చ మొదలైంది. “ఈ మాటలతో బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు?” అనే ప్రశ్న అందరిలో తలెత్తింది. ఇటీవల టాలీవుడ్‌లో పలు నిర్మాతల మధ్య మాటల యుద్ధం, సినిమాల వాయిదాలు, సక్సెస్‌పై క్రెడిట్ తీసుకోవడంపై వివాదాలు చెలరేగిన నేపథ్యంలో, ఆయన ఈ ట్వీట్ చేసిన తీరు చూసి కొంతమంది ఇది ఆ నిర్మాతలలో ఒకరినే టార్గెట్ చేశారని ఊహిస్తున్నారు.
ఇక బండ్ల గణేష్ గతంలో కూడా పలువురిపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనదైన స్టైల్లో “సినిమా అంటే డబ్బులు కాదు, ధైర్యం కావాలి” అంటూ ఇండస్ట్రీలోని పరిస్థితులపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన కొత్త ట్వీట్ కూడా అదే తరహాలో ఉండటంతో, సినీ వర్గాల్లో చర్చ మళ్లీ వేడెక్కింది. అయితే బండ్ల గణేష్ మాత్రం తన ట్వీట్‌లో ఎవరిపేరూ ప్రస్తావించలేదు. కానీ ఆయన స్టేట్‌మెంట్ టోన్ చూస్తే, ఇటీవల ఇండస్ట్రీలో సైలెంట్‌గా నడుస్తున్న కొన్ని ప్రాజెక్టుల రాజకీయాలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు అనిపిస్తుంది. మరి ఈ కామెంట్ నిజంగా ఎవరిని ఉద్దేశించి చేశారో? లేక సాధారణంగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై నేనా? అనేది తెలియాల్సి ఉంది.
“అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……!
— BANDLA GANESH. (@ganeshbandla) October 16, 2025