శ్రీ రాపాక.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బిగ్ బాస్ లో పాల్గొని ఈ భామ గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ గా ఈ భామ మంచి క్రేజ్ తెచ్చుకుంది.ఈ భామ దేశముదురు, చందమామ మరియు నచ్చావులే వంటి సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసింది.ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన నగ్నం సినిమాలో బోల్డ్ గా నటించి అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది.. ఈ సినిమాతోనే శ్రీరాపాక కు ఇండస్ట్రీ లో బాగా ఫేమ్ వచ్చింది.అయితే తాజాగా ఈ భామ ఓక ఇంటర్వ్యూలో భాగంగా బోల్డ్ కామెంట్స్ ను చేసింది. ఈ భామ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఆమె మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకుంది. తన ఫస్ట్ నైట్ రోజు న తన భర్త గే అని తెలిసి ఆమె ఎంతగానో బాధపడింది. ఒక డాక్టర్ కే అలా జరిగిందంటే అర్ధం చేసుకోండి. అందుకే పెళ్లికి ముందే శృంగారం చేస్తే అతను మగాడ కాదా అని తెలుస్తుంది. నా దృష్టి లో శృంగారం అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరం. అది ఇవ్వలేని వ్యక్తిని పెళ్లి చేసుకోని బాధపడటం అస్సలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటూ ఆమె ఎంతో బోల్డ్ గా మాట్లాడేసింది.ప్రస్తుతం శ్రీ రాపాక కామెంట్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీ రాపాక కామెంట్స్ కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఆమె కు వ్యతిరేకంగా కామెంట్స్ ను చేస్తున్నారు..ఈ భామకు అవకాశాలు లేక ఎలాగైనా పాపులర్ అవ్వాలని ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేస్తుందని అని కొందరు విమర్శిస్తున్నారు.