PM Modi: ‘నాటు నాటు’ సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది.. ప్రధాని అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 95వ అకాడెమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకున్న ‘నాటు నాటు’ వైరల్ సాంగ్ కోసం సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గ్లోబల్ హిట్ ఫిల్మ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయాన్ని ‘అసాధారణమైనది’గా పేర్కొంటూ.. ‘నాటు నాటు’కి ప్రపంచవ్యాప్త ఆదరణ ఉందని, ఇది రాబోయే సంవత్సరాలకు గుర్తుండిపోయే పాటగా ఉంటుందని ప్రధాని అన్నారు.
Exceptional!
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
The popularity of ‘Naatu Naatu’ is global. It will be a song that will be remembered for years to come. Congratulations to @mmkeeravaani, @boselyricist and the entire team for this prestigious honour.
India is elated and proud. #Oscars https://t.co/cANG5wHROt
— Narendra Modi (@narendramodi) March 13, 2023
విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడిన ఈ పాట మార్చి 2022లో విడుదలైన వెంటనే అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరిలో ‘నాటు నాటు’ గోల్డెన్ గ్లోబ్ 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును గెలుచుకుంది. మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును కూడా గెలుచుకుంది. స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌కు ఆస్కార్‌లు ప్రదానం చేయబడ్డాయి. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ నుంచి చాలా వైరల్ అయిన ఈ ట్రాక్‌లో నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. వీరంతా అకాడమీ అవార్డులకు హాజరయ్యారు. ‘నాటు నాటు’ హెవీ వెయిట్ పోటీదారులను ఓడించింది. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాడారు. అయితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ వేదికపై దానిని ప్రదర్శించలేదు.
Read Also: Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్.. కేసీఆర్ హర్షం..
మరో ట్వీట్‌లో ప్రధాని మోదీ.. ఆస్కార్‌లో రెండో విజయం సాధించినందుకు డాక్యుమెంటరీ చిత్రనిర్మాతలు కార్తికి గోన్సాల్వేస్, గునీత్ మోంగాలను కూడా అభినందించారు. వారి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్‌ను గెలుచుకుంది. “వారి పని సుస్థిర అభివృద్ధి, ప్రకృతికి అనుగుణంగా జీవించడం ప్రాముఖ్యతను అద్భుతంగా హైలైట్ చేస్తుంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Congratulations to @EarthSpectrum, @guneetm and the entire team of ‘The Elephant Whisperers’ for this honour. Their work wonderfully highlights the importance of sustainable development and living in harmony with nature. #Oscars https://t.co/S3J9TbJ0OP
— Narendra Modi (@narendramodi) March 13, 2023
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..