Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ‘‘లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న మంటల కారణంగా ఓటింగ్ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు. ఇకపోతే, ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు…
సినిమా కన్ను తెరచింది ఫ్రెంచ్ దేశంలో అయినా, చలనచిత్రాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత నిస్సందేహంగా అమెరికాకే దక్కుతుంది. మొదటి నుంచీ సినిమాను, అందుకు సంబంధించిన విభాగాలనూ అమెరికా ప్రోత్సహిస్తూ వచ్చింది. అందులో భాగంగానే 1929 మే 16న ఆస్కార్ అవార్డులుగా జగద్విఖ్యాతి గాంచిన 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్'ను ఏర్పాటు చేసింది.
95వ అకాడెమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకున్న 'నాటు నాటు' వైరల్ సాంగ్ కోసం సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గ్లోబల్ హిట్ ఫిల్మ్ 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందుగా ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు 'ప్రిడిక్షన్స్' ప్రకటించాయి. 'లాస్ ఏంజెలిస్ టైమ్స్, కలైడర్ డాట్ కామ్, హిందుస్థాన్ టైమ్స్ , ఫిలిమ్ ఎక్స్ ప్రెస్, వరైటీ మేగజైన్" వంటి ప్రముఖ సంస్థల ప్రిడిక్షన్స్ లో దాదాపు 70 శాతం నిజమయ్యాయి.
రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్'లో చంద్రబోస్ రాసిన, కీరవాణి స్వరపరచిన "నాటు నాటు..." అంటూ సాగే పాటకు ఆస్కార్ అవార్డు లభించగానే ఒక్కసారిగా 95వ ఆస్కార్ ఫలితాలు చూస్తోన్న భారతీయులు ఆనందంతో చిందులు వేశారు.
అసాధ్యం సుసాధ్యమయింది. తెలుగు సినిమాలకూ ఆస్కార్ వస్తుందా? అంటూ వెటకారం చేసిన స్వదేశీయులకే విదేశీయులు సైతం మెచ్చేలా సమాధానం ఇచ్చిన ఘనత నిస్సందేహంగా మన తెలుగువారికి దక్కింది.
ప్రపంచంలో ఇప్పటి వరకు కొన్ని వేల సినిమాలు వచ్చి ఉంటాయి. అందులో తప్పకుండా చూసి తీరాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ది బ్రిడ్డ్ ఆన్ ది రివర్ కవాయ్. 2.8 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం 1957 అక్టోబర్ 11 న యూకేలో రిలీజ్ కాగా, డిసెంబర్ 14, 1957లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. దాదాపుగా 30.6 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. వార్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో…