ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వింత వెలుగు చూస్తుంది.. కొన్ని వింటే నిజంగా మాయేనా.. లేదా ఏవరైనా చేస్తున్నారు అని ఆశ్చర్యం కలుగుతుంది.. ఎక్కడైనా పక్షులు పకృతి వైపరీత్యాల వల్ల చనిపోవడం మనం చూసే ఉంటాం.. కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోతాయని ఎప్పుడైనా విన్నారా.. ఏంటి అలా ఎందుకు చనిపోతాయి అని అనుకుంటున్నారుగా.. ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ వింత ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే జరుగుతుంది..
అస్సాంలో ఇలాంటి వింత ఘటన జరుగుతుంది.. జాతింగా విలేజ్ రాత్రి అయితే ఈ గ్రామంలోకి ప్రవేశం నిషేధం. ఇతర గ్రామాలతో 9 నెలలుగా ఈ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయట. ఎందుకంటే ఈ గ్రామంలో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో పక్షులు ఆత్మహత్యకు పాల్పడుతుంటాయి. ఇళ్లను, చెట్లను ఢీకొట్టుకుని చనిపోతున్నాయి.. ఆగస్టు నుంచి నవంబర్ వరకు కొత్త పక్షులు సందడి చేస్తాయి.. అలాగే ఆత్మహత్య చేసుకొని చనిపోతాయి.. అందుకు కారణాలు ఏంటనేది తెలియట్లేదు.
ఈ గ్రామానికి అనేక జాతుల పక్షులు వస్తుంటాయి. ఒక్కోసారి విదేశీ పక్షలు కూడా వస్తుంటాయి. అవి కూడా ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడుతున్నాయి. ఇక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలు ప్రజలకు అర్ధం కావట్లేదు.అయితే ఇక్కడ అయస్కాంత శక్తి ఎక్కువఅని పరిశోదకులు కూడా చెబుతున్నారు.. గ్రామస్తులు మాత్రం రకరకాల కథలు చెబుతున్నారు..ఈ గ్రామంలో ఏదో దుష్టశక్తి ఉందని.. అది పక్షులను బతకనివ్వట్లేదని నమ్ముతున్నారు. దాని నుంచి తమను రక్షించుకోవడం కోసం వారు ఇళ్ల ముందు వెదురు కర్రలు పాతిపెట్టారు.. అయితే అస్సలు నిజం మాత్రం తెలియలేదు.. కానీ ఈ గ్రామానికి ‘సూసైడ్ పాయింట్ ఆఫ్ బర్డ్స్’ గా పిలుస్తున్నారు..