SIP: ఎంత సంపాదించినా కోటీశ్వరులు కాలేకపోతున్నారా.. ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయా.. కొన్ని చిట్కాలు పాటిస్తే తక్కువ కాలంలోనే కోటీశ్వరులు కావడం ఖాయం. ఎటువంటి శ్రమ లేకుండానే మిమ్మల్ని అతి తక్కువ సమయంలో కోటీశ్వరులను చేసే ట్రిక్ ఈ రోజు తెలుసుకుందాం.. కాకపోతే మీరు చేయాల్సిందల్లా మీరు సంపాదించే దాంట్లో కొద్దిమొత్తం పొదుపు చేయగలగాలి. మీరు మిలియనీర్ కావడానికి ప్రతి నెలా కొంత మొత్తాన్ని సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్)లో పెట్టుబడి పెట్టాలి. అవును, మ్యూచువల్ ఫండ్స్ ఈ రోజుల్లో పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే సిప్ తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని ఇవ్వడం ద్వారా పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. ఇందులో పెట్టుబడిదారులు చాలా ఎక్కువ రాబడిని పొందుతున్నారు. 10,000 రూపాయల పెట్టుబడి పెడితే మీకు కోట్ల విలువైన నిధులను ఎలా సమకూర్చుగలుగుతారో చూద్దాం.
Read Also:Adah Sharma: కేరళ స్టోరీ తర్వాత క్రిమినల్ ఆర్ డెవిల్ అంటున్న ఆదా శర్మ..
మీరు మ్యూచువల్ ఫండ్స్లో రూ. 100 నుండి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ మీరు కోట్ల విలువైన నిధులను మాత్రమే సేకరించాలనుకుంటే దానిలో రూ.10,000 పెట్టుబడి పెట్టాలి. MFI, FundsIndia రీసెర్చ్ డేటా ప్రకారం.. 10,000 రూపాయల SIP పెట్టుబడిదారుని ఇరవై ఏళ్లలో లక్షాధికారిని చేయగలదు. అయితే, నెలకు 20,000 పెట్టుబడి పెడితే 15ఏళ్లలోనే మిలియనీర్ అయిపోవచ్చు. ఇంకా 25వేలు పెట్టుబడి పెడితే 13ఏళ్లలోనే లక్షాధికారి కావచ్చు.
Read Also:Pawan Kalyan OG: ఆ నంబర్ ని మూడు రోజుల్లోనే ఊదేస్తారు
10 సంవత్సరాలలో మిలియనీర్ అవ్వడం ఎలా?
ప్రతినెల రూ.40,000 SIPలో పెట్టుబడిదారుడు 10 సంవత్సరాల పాటు పెట్టుబడిపెడితే కోటీశ్వరుడు కావచ్చు. 50000 నెలవారీ SIP మిమ్మల్ని దాదాపు తొమ్మిదేళ్లలో లక్షాధికారిని చేస్తుంది. అంటే, మీరు ఎంత ఎక్కువ మొత్తాన్ని SIPలో పెడితే అంత త్వరగా మీరు కోటీశ్వరులుగా మారగలుగుతారు. పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ 15 X 15 X 15 నియమాన్ని గుర్తుంచుకోవాలి. ఒక పెట్టుబడిదారుడు 15 సంవత్సరాల పాటు రూ. 15,000 పెట్టుబడి పెడితే అతను 15శాతం రాబడిని ఆశించవచ్చు.. అప్పుడు మీకు మెచ్యూరిటీలో సుమారు రూ.కోటి పొందుతారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.