Adah Sharma: కేరళ స్టోరీ తర్వాత క్రిమినల్ ఆర్ డెవిల్ అంటున్న ఆదా శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆదా శర్మ.. ఆ సినిమా హిట్ అవ్వకున్నా మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఇటీవల కేరళ స్టోరీ సినిమాలో నటించి హిట్ టాక్ తో పాటుగా విమర్శలు కూడా అందుకుంది.. ఇప్పుడు మరో హార్రర్ సినిమాతో భయపెట్టనుంది.. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే జానర్ హారర్. ఈ జానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు ఆడియన్స్‌ని థ్రిల్ చేశాయి. హారర్ జానర్ లోనూ వైవిధ్యం చూపించిన సినిమాలైతే సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఇప్పుడు అదే బాటలో సరికొత్తగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ C.D రాబోతోంది.
ఇప్పటివరకు చూసిన హారర్ జానర్స్ లోకెల్లా ఆడియన్స్‌కి డిఫరెంట్ అనుభూతి కలిగించే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ది కేరళ స్టోరీ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం. ఇప్పుడు C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ జనాలను ఆకట్టుకుంటుంది..
Also Read
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
- Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
- Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అదా శర్మ సీరియస్ లుక్, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. C.D అనే టైటిల్ క్రిమినల్ ఆర్ డెవిల్ అనే ట్యాగ్ లైన్‌తో పోస్టర్ చూడగానే సినిమాపై అంచనా వచ్చేలా డిజైన్ చేశారు.. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కొత్త దారిలో వెళుతున్నాం అని పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ C.D ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచిందనే చెప్పుకోవచ్చు.. ఇక ఈ సినిమాలో అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేయనున్నారు..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!