సండే వచ్చిందంటే చాలు మటన్, చికెన్ షాపుల ముందు క్యూలు కడుతుంటారు నాన్ వెజ్ ప్రియులు. ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి. మరికొందరైతే డైలీ తినేందుకు కూడా వెనకాడరు. ఇక మాంసం విషయానికి వస్తే గొర్రె, పొట్టేలు, మేక మాంసాలు అమ్ముతుంటారు. ఎవరికి నచ్చిన మాంసాన్ని వారు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల గొర్రె మాంసానికి డిమాండ్ తగ్గిపోయింది. గొర్రె మాంసాన్ని కొనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓ మటన్ వ్యాపారి చేసిన పని తెలిస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం.
Also Read:Yashasvi Jaiswal: గ్యాలరీ నుంచి రోహిత్ నాకు మెసేజ్ పంపించాడు.. అందుకే రెచ్చిపోయా..
ఇంతకీ ఆయన ఏం చేశాడంటే.. గొర్రె మాంసం కొంటలేరని దాని తోక కట్ చేసి.. ఫెవిక్విక్ తో మేకతోక అంటించి గొర్రె మాంసాన్ని మేక మాంసంగా విక్రయిస్తూ నాన్ వెజ్ లవర్స్ ను బురిడీ కొట్టిస్తున్నాడు. ఈ ఘటన కాకినాడలోని సామర్లకోట మండలం గొంచాలలో వెలుగుచూసింది. గొర్రె కి అంత డిమాండ్ లేకపోవడంతో గొర్రె మాంసాన్ని మేక మాంసంగా అమ్మేందుకు కొత్త ట్రిక్స్ కు తెరలేపాడు ఆ వ్యాపారి. ఇది తెలిసిన వారు ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు.