అనకాపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది.. ఊడేరు రోడ్డు పక్కన పొలాల్లో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది.. తలపై గాయాలతో రక్తపు మడుగులో మృత దేహన్ని గుర్తించారు స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు… అయితే.. మృతదేహం రౌడీ షీటర్ రాజాన కన్నబాబు గా గుర్తించారు.. మృతుడి పై విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది.. నిన్న రాత్రి ప్రత్యర్ధులు రౌడీ షీటర్ తో గొడవపడి తలపై కొట్టి చంపినట్లు భావిస్తున్నారు..
Also Read : Uddhav Thackeray: ఠాక్రే, అంబేద్కర్ ఫోటోల పక్కన ఔరంగజేబు.. మహారాష్ట్రలో సరికొత్త వివాదం..
స్థానికులు పోలీసులు కు సమాచారము ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. మృతుడు అనకాపల్లి పట్టణంలో ఉండడంతో అనకాపల్లి పోలీస్ స్టేషన్కు రౌడీ షీట్ ట్రాన్స్ఫర్ చేశారు… హత్య ఎవరు చేశారు అనేది తెలియాల్సి ఉంది. అయితే విశాఖ నగర పోలీసు అధికారులు రెండేళ్ల క్రితం నగర బహిష్కరణ చేశారు. అనకాపల్లి గాంధీ నగరంలో తల్లితోపాటు కన్నబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. కన్నబాబు విశాఖ ఉమ్మడి జిల్లాల్లో భూ దందాలు సెటిల్మెంట్లు కిడ్నాప్ హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు.
Also Read : Kollur: 2BHK ఇళ్లను ప్రారంభించిన సీఎం.. టౌన్ షిప్ కి కేసీఆర్ నగర్ గా నామకరణం