Kollur: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూమ్ టౌన్‌షిప్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం కేసీఆర్ వీక్షించారు. టౌన్‌షిప్‌కి “కేసీఆర్ నగర్” అని పేరు పెట్టారు. సీఎం చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను అందుకున్నారు. అంతకుముందు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఇవాల ఉదయం కొల్లూరు చేరుకున్న సీఎం డబుల్ బెడ్‌రూమ్ టౌన్‌షిప్ ఆవరణలో మొక్కలు నాటారు.
Read also: New Delhi: జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు
అనంతరం టౌన్‌షిప్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. మొత్తం 145 ఎకరాల్లో రూ.1432.50 కోట్లతో 15,600 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు.G+9 నుండి G+10 , G+11 అంతస్తుల వరకు టౌన్‌షిప్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 117 బ్లాకులు, ఒక్కో బ్లాక్‌కు 2 లిఫ్టులు, మొత్తం 234 లిఫ్టులు ఏర్పాటు చేశారు. టౌన్‌షిప్‌లో మురుగునీటి శుద్ధి కేంద్రం, పాఠశాలలు, 118 వాణిజ్య దుకాణాలు నిర్మించారు. ఇక సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న రైల్వేకోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో దాదాపు 100 ఎకరాల స్థలంలో 1000 కోట్ల పెట్టుబడితో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని మేధా సంస్థ నిర్మించింది. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనుంది. ప్రతి ఏటా 500 రైల్వేకోచ్ లు, 50 లోకోమోటివ్ లు ఉత్పత్తి చేసేలా నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Uddhav Thackeray: ఠాక్రే, అంబేద్కర్ ఫోటోల పక్కన ఔరంగజేబు.. మహారాష్ట్రలో సరికొత్త వివాదం..