సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ‘మురారి’. 2001లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో మహేశ్ బాబు క్రేజ్ ను పెంచింది. అయితే ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. విడుదలై ఎన్నేళ్లు గడిచినా ఈ సినిమాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. కథ, కథనంతో పాటు సంగీతం ‘మురారి’ మహేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి చిత్రంగా నిలిపింది. ఇప్పుడు ఈ సినిమాను 4K ఫార్మాట్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : JanaNayagan : జననాయగన్ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
నూతన సంవత్సర కానుకగా ఈ నెల 31న మురారి 4K రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ రీ రిలీజ్ చేస్తుండగా ఆంధ్రలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబందించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అలాగే ఈ సినిమా రీరిలీజ్ తో మరొక ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. సింగిల్ స్క్రీన్స్ లో మురారి సినిమా టికెట్ ధరను సింగిల్ స్క్రీన్స్ లో రూ. 99, అలాగే మల్టిప్లెక్స్ లో రూ. 105గా ఫిక్స్ చేస్తూ బుకింగ్స్ ఓపెన్ చేశారు. టికెట్ ధర తక్కువగా ఉండడంతో ఆ ప్రభావం బుకింగ్స్ లో కనిపించింది. చాలా ఏరియాలో అడ్వాస్స్ బుకింగ్స్ అన్ని హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఇదే జోష్ లో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు వారణాసి గ్లిమ్స్ ను మురారికి అటాచ్ చేయబోతున్నారు.