Indrakaran Reddy: మా ఓట్లు కావాలి కానీ, మా నిర్మల్ అభివృద్ధి మీకు పట్టదా? ప్రధాని మోడీ ఏ మొహం పెట్టుకుని నిర్మల్ కు వస్తున్నారు? అని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ కు రైల్వే లైన్ ఏదీ? అని ప్రశ్నించారు. సైన్స్ సెంటర్, బాసర ఆలయ అభివృద్దికి నిధులేవి? కేంద్రీయ విద్యాలయం, నవోదయ స్కూల్ ఏర్పాటు ఏమైంది? ని ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ నెల 26న ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారానికి నిర్మల్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా? బీజేపీ వల్ల పైస లాభమైన జరిగిందా? నిర్మల్ కు రైల్వే లైన్ ఏమైంది? నిర్మల్ లో నవోదయ స్కూల్, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు మీకు పట్టదా? అని మండిపడ్డారు. నిర్మల్ లో శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసేందుకు సైన్స్ సెంటర్, ప్లానిటోరియం నిర్మాణానికి నిధులు అడిగామని అన్నారు.
Read also: Ponguleti Srinivas Reddy: ఈ ఎన్నికలు దోపిడి రాజ్యానికి ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం
హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన సైన్స్ సెంటర్ కోసం 25 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తేనే నిర్మల్ సైన్స్ సెంటర్‌కు అనుమతులు, నిధులు మంజూరు చేస్తామని కేంద్రం మెలిక పెట్టిన మాట వాస్తవం కాదా? అని మండిపడ్డారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బాసర జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రసాద్ స్కీం క్రింద నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపిస్తే బుట్టదాఖలు చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రధాని మోడీని నిదీశారు. కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం ప్రభుత్వం కానీ, స్థానిక బీజేపీ ఎంపీ గానీ నిర్మల్ కు రూపాయి మందం లాభం చేశారా? అని ద్వజమెత్తారు. ఓట్ల కోసం కాకుండా నిర్మల్ అభివృద్ధి పనుల శంఖుస్థాపన చేయడానికి వస్తే… ఘనంగా స్వాగతం పలికే వారిమని అన్నారు.
Ishan Kishan-Suryakumar: అతడిని టార్గెట్ చేయని సూర్యకుమార్ చెప్పాడు: ఇషాన్