Mumbai Indians: ఈ విదేశీ ఆటగాళ్లపై ముంబై ఇండియన్స్ ఫోకస్.. జట్టులోకి తీసుకునేందుకు వ్యూహాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఐదుసార్లు టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అంతేకాకుండా.. క్రికెట్ అభిమానులకు ఆ టీమ్ అంటే ఎంతో పిచ్చి. అలాంటిది గత సీజన్ తమ అభిమానులను ఎంతో నిరాశపరిచింది. అందుకోసమని 2024 సీజన్ పై ముంబై ఇండియన్స్ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జట్టులోకి విదేశీ ప్లేయర్లును తీసుకునే ఆలోచనలో ఉంది.
ఐపీఎల్ 2024 కోసం డిసెంబర్ 19న దుబాయ్‌లో వేలం నిర్వహించనున్నారు. అందుకోసం ఐపీఎల్ లో ఆడే జట్లు అందులో పాల్గొననున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ జట్టు ఈ వేలంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకోవడానికి వ్యూహాలు చేస్తోంది. అయితే వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడిన ఈ ముగ్గురు ఆటగాళ్లపై ముంబై ఇండియన్స్ ఫోకస్ పెట్టింది. ఇంతకీ ఆ ఆటగాళ్ల ఎవరో తెలుసుకుందాం.
Also Read
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
Read Also: Mahua Moitra: మహువా మోయిత్రా వివాదంపై తొలిసారి స్పందించిన దీదీ.. ఆమెకే ప్లస్ అంటూ..
గెరాల్డ్ కోయెట్జీ, దక్షిణాఫ్రికా బౌలర్
ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో ఈ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు జోఫ్రా ఆర్చర్ స్థానంలో కోయెట్జీని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్చర్ ఐపీఎల్ 2023లో అనుకున్నంతగా రాణించలేదు. అంతేకాకుండా.. అతను గాయం సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ కారణంగా అతని స్థానంలో కోయెట్జీని ముంబై ఇండియన్స్ తీసుకునే అవకాశం ఉంది.
దునిత్ వెల్లలాగే, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్
శ్రీలంక యువ స్పిన్ బౌలర్ దునిత్ వెల్లలాగేపై కూడా ముంబై ఇండియన్స్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాఘవ్ గోయల్ స్థానంలో స్పిన్ ఆప్షన్‌గా దునిత్ వెల్లలాగేను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక.. ముంబై ఇండియన్స్‌కు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కూడా అవసరం.
పాట్ కమిన్స్, ఆస్ట్రేలియా బౌలింగ్ ఆల్ రౌండర్
ఇటీవల ముగిసిన ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 15 వికెట్లు సాధించాడు. అంతేకాకుండా బ్యాటింగ్ లో కూడా రాణించాడు. ఈ క్రమంలో.. ముంబై ఇండియన్స్‌కు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అవసరం. అందువల్ల.. వేలంలో కమిన్స్ కోసం ముంబై ఇండియన్స్ భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..