Tapsee: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taapsee Pannu married her Love Mathias Boe in an intimate Cermony: రాఘవేంద్ర రావు – మంచు మనోజ్ ఝుమ్మంది నాదం సినిమాలో హీరోయిన్‌గా నటించి ఫేమస్ అయిన నటి తాప్సీ తన ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో తాప్సీ హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన నటించిన ఆమె ఆ తర్వాత అనేకమంది స్టార్స్ తో కూడా నటించింది. ఇక ఆమె కొన్ని సినిమాలు చేసి తమిళం ఆ తరువాత బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ సినిమా అవకాశాలు వెల్లువెత్తడంతో ఇక టాలీవుడ్ వైపు రాకుండా బాలీవుడ్ లోనే సెటిల్ అయింది. తాప్సీ మథియాస్ బో అనే బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ 2013లో మొదటిసారి కలిశారు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఆడేందుకు మథియాస్ భారతదేశానికి వచ్చినప్పుడు, తాప్సీ మథియాస్ పోను కలుసుకుంది.
Tollywood Shooting Updates: రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీ, బాలయ్య, శర్వా.. ప్రభాస్ మాత్రం?
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
అప్పుడు ఏర్పడిన వీరి పరిచయం చివరికి ప్రేమగా మారింది. 10 ఏళ్లకు పైగా డేటింగ్ చేసిన ఈ జంట ఇప్పుడు సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. వీరి వివాహం మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగినట్లు సమాచారం. తాప్సీ తమ వివాహాన్ని ప్రైవేట్ గా చేసుకోవాలని ప్లాన్ చేసిందని అందుకే సెలబ్రిటీలను ఆహ్వానించలేదని అంటున్నారు. తాప్సీ పెళ్లికి సినీరంగంలోని ఆమె సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అలాగే పెళ్లికి వచ్చిన వారి ఫొటోలు తీసి ప్రచురించకూడదని షరతు విధించినట్లు సమాచారం. దీని కారణంగా, తాప్సీ స్నేహితులు, స్నేహితురాళ్లు చాలా మంది వివాహానికి హాజరైనప్పుడు తీసిన చిత్రాలను పోస్ట్ చేయకుండా ఉన్నారు. దీంతో గత రెండు రోజులుగా వీరి పెళ్లికి సంబంధించిన సమాచారం బయటకు రాకపోగా.. ఇప్పుడు లీక్ అయింది. నటి తాప్సీ వివాహం సిక్కు, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!