ఈ సంక్రాంతికి థియెటర్‌లు కళకళలడబోతున్నాయి. అందులో ముఖ్యంగా చిరు మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం మాత్రం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ స్వింగ్‌లో ఉన్న ఈ సినిమా బడ్జెట్ మరియు రెమ్యూనరేషన్ల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాను సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా, ప్రమోషన్ ఖర్చులతో కలిపి అది రూ.250 కోట్ల వరకు చేరిందని అంచనా. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన స్పెషల్ అప్పీయరెన్స్‌లో మెరవబోతున్నారు. కాగా
Also Read : Dimple Hayathi : పూజలతో ఎవరూ స్టార్ అయిపోరు.. వేణు స్వామి పై డింపుల్ హయాతి షాకింగ్ కామెంట్స్!
వీరి రెమ్యూనరేషన్ల విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు సుమారు రూ.70 నుంచి రూ.72 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందినట్లు సమాచారం. మరోవైపు, ఈ చిత్రంలో దాదాపు 30 నిమిషాల పాటు కనిపించే విక్టరీ వెంకటేష్, తన పాత్ర కోసం రూ.10 నుంచి రూ.15 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చిరు-వెంకీల కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్లు మరియు ‘మెగా విక్టరీ’ మాస్ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోల క్రేజ్ చూస్తుంటే, సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది.