MS Dhoni Angry Moment: తన కూల్ కెప్టెన్సీతో ఎన్నోసార్లు ఓటమి ముగింట ఉన్న జట్టుకు విజయాన్ని చేరువ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. వికెట్ల వెనుక నుంచి మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తూ.. ప్రత్యర్థి జట్టను తీవ్ర ఒత్తిడికి గురి చేయడంలో 100% విజయవంతమైన వ్యక్తిగా ఆయనకు గొప్ప రికార్డు ఉంది. మాహీ మొత్తం క్రికెట్ కెరీర్‌లో వేళ్ల మీద లెక్కించే అన్నిసార్లు మాత్రమే తన సహనాన్ని కోల్పోయాడు. పాపం ఆయన సహనం కోల్పోయిన సమయంలో తాను బలైపోయానని ఓ టీమిండియా మాజీ క్రికెటర్ వాపోయాడు. తనను ధోని కోపంతో తిట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఈ టీమిండియా మాజీ క్రికెటర్ ఎవరూ.. ఆయనను కెప్టెన్ కూల్‌పై ఎందుకు తిట్టాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Jatadhara: ‘జటాధర’లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్!
ఏం జరిగిందంటే..
ఛాంపియన్స్ లీగ్ టీ20 సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుందని టీమిండియా మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. తాను ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేసి, కేకేఆర్ డేంజరస్ బ్యాటర్ యూసుఫ్ పఠాన్‌ను అవుట్ చేసినా కూడా మాహీ తనను తిట్టడం ఆపలేదని అన్నాడు. అందుకు ఓ కారణం ఉందని చెప్తూ… నిజానికి ధోని ఆ ఓవర్ వేసేందుకు ఈశ్వర్ యాదవ్ అనే బౌలర్‌ను పిలిచాడు. పొరపాటున తనను పిలుస్తున్నాడనుకొని బౌలింగ్ వేసేందుకు వెళ్లిపోయా.. ఇవేం తెలియకుండా రన్నప్ వద్దకు చేరుకొని.. బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాను. ధోని వచ్చి తనను పిలువలేదని, ఈశ్వర్ యాదవ్‌ను బౌలింగ్ వేసేందుకు పిలిచానని చెప్పాడు. అప్పటికే నేను రన్నప్ తీసుకునేందుకు రెడీగా ఉండటంతో అంపైర్ నన్నే బౌలింగ్ చేయాలని చెప్పడంతో మాహీకి కోపం వచ్చింది. కెప్టెన్ కూల్ కాస్త తనపై యాంగ్రీ మాన్ అయిపోయాడు. ఎందుకు బౌలింగ్ వేయడానికి వచ్చావ్ అంటూ నన్ను తిట్టాడు. చేసేది లేక బౌలింగ్ చేశా.. నా ఓవర్ తొలి బంతికే కేకేఆర్ బ్యాటర్ యూసుఫ్ పఠాన్ వికెట్ తీసినా కూడా మాహీ సంతోషపడకుండా.. తనను తిట్టడం ఆపలేదంటూ మోహిత్ చెప్పాడు. ఏదేమైనా మాహీ కూల్ కెప్టెన్ అని అన్నాడు.
READ ALSO: AP Bar Re-Notification: ఏపీలో మిగిలిపోయిన 432 బార్లకు రీ–నోటిఫికేషన్.. ఈనెల 15న లక్కీ డ్రా