Jatadhara: ‘జటాధర’లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ‘జటాధర’ చిత్రానికి సంబంధించిన బజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపించబోతోన్న ఈ మూవీని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకం నిర్మిస్తోంది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి శిల్పా శిరోద్కర్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
‘ఖుదా గవా’, ‘మృత్యుదంద్’ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న శిల్పా శిరోద్కర్ ‘జటాధర’ చిత్రంలోని పర్ఫామెన్స్‌తో అవార్డులన్నీ గెలిచేస్తారని ప్రేరణ అరోరా అన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘జటాధర’లోని శోభ అనే పాత్రలో నటించిన శిల్పా శిరోద్కర్‌కు అన్ని అవార్డులు వస్తాయని ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. శోభ ఒక శక్తివంతమైన, సంక్లిష్టమైన పాత్ర. ఈ పాత్రకు ఆమె తన నటనతో ఎంతో ఇంటెన్స్‌ను తీసుకు వచ్చి న్యాయం చేశారు. ఆమె ప్రేక్షకులకు పూర్తిగా ఆశ్చర్యపరుస్తుంది’ అని అన్నారు.
Also Read
Also Read:Nagini Dance: వీడు కేక.. నాగినికే నాగిని డాన్స్ నేర్పాడు.
‘జటాధర’ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు. సస్పెన్స్, యాక్షన్, మిస్టరీల ప్రత్యేకమైన కథతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ‘జటాధర’లో శిల్పా శిరోద్కర్, సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
ఇప్పటికే శోభ పాత్రలో నటి శిల్పా శిరోద్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ‘జటాధర’ ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!