Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రుల విమర్శలు
- పార్లమెంట్‌లో చోటుచేసుకున్న సంఘటనలో
- గాయపడ్డ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజపుత్‌లను
- పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బండి సంజయ్.
- రాహుల్ గాంధీపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: గురువారం నాడు పార్లమెంట్‌లో చోటుచేసుకున్న సంఘటనలో గాయపడ్డ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజపుత్‌లను ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బండి సంజయ్ పరామర్శించారు. పార్లమెంట్‌లో జరిగిన తోపులాటలో ఇద్దరు ఎంపీలు గాయపడటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వరుస ఓటముల కారణంగా ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగిందని విమర్శించారు.
Also Read: Devendra Fadnavis: భారత్ జోడో యాత్రలో “అర్బన్ నక్సల్స్” పాల్గొన్నారు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు!
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
అంబేద్కర్ పై గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును గుర్తుచేసిన కిషన్ రెడ్డి.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని, కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేయించిన వారు కూడా వారే. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవరు? కేంద్ర హాల్లో విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నది కూడా వారే అని ఆయన అన్నారు. అంబేద్కర్ ని అడుగడుగునా అవమాన పరిచిన చరిత్ర కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల మన్ననలు పొందుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ గారి ఆలోచనలను ప్రధానమంత్రి మోడీ ఫాలో అవుతున్నారు. ఆయన అడిగిన పంచతీర్థాలను అభివృద్ధి చేసి దేశ ప్రజలకు అంకితం చేశారని తెలిపారు.
Also Read: FIR On KTR: కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వండి.. ఏసీబీకి ఈడీ లేఖ
రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ, పార్లమెంట్‌లో టీషర్ట్ వేసుకుని యువకుడిగా కనిపిస్తూ ఎంపీలపై దాడులు చేయడం దారుణం అని అన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో దేశ రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాహుల్ గాంధీపై ఈ విమర్శలు, పార్లమెంట్‌లో చోటుచేసుకున్న ఘటన రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!